News March 26, 2025

విశాఖ అభివృద్ధిపై కలెక్టర్ నివేదిక.. అంశాలివే..!

image

➤ 98 ఎకరాల్లో 5 సోలార్ ప్లాంట్లు, 100 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
➤ ట్రాఫిక్ నియంత్రణకు 72.82 కి.మీ. పొడవున 15 రహదారులు జూన్ నాటికి పూర్తి
➤ జీవీఎంసీ పరిధిలో ఐదు చోట్ల వర్కింగ్ విమెన్ హాస్టల్స్
➤ పరదేశిపాలెంలో రూ.70లక్షలతో కాలేజీ అమ్మాయిలకు హాస్టల్ భవనం నిర్మాణం
➤ రూ.కోటితో కేజీహెచ్ ఓపీ, క్యాజువాలటీ ఆధునీకరణ
➤ విశాఖ పోర్టులో క్రూయిజ్ టూరిజం ప్రారంభం
➤ బీచ్‌లో హోప్ ఆన్, హోప్ ఆఫ్ బస్సు సర్వీసులు

Similar News

News April 2, 2025

విశాఖ స్టీల్‌ ప్లాంట్ ఉద్యోగి మృతి

image

స్టీల్ ప్లాంట్ ఉద్యోగి బి.పెంటయ్య చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. స్టీల్ ప్లాంట్ SMS-2 విభాగంలో గతనెల 14న మంటలు చెలరేగడంతో ఉద్యోగి బి.పెంటయ్య తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. దీంతో స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

News April 2, 2025

పెదగంట్యాడలో అమ్మాయి ఆత్మహత్య

image

పెదగంట్యాడ మండలానికి చెందిన 21 ఏళ్ల అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. విశాఖలోని ఓ ఇనిస్టిట్యూట్‌లో డిప్లమో ఫైనల్ ఇయర్ చదువుతున్న పైలా దివ్య పెదగంట్యడలోని నేతాజీ నగర్‌లో ఉంటోంది. సోమవారం తల్లిదండ్రులు ఇద్దరూ బయటకు వెళ్లారు. ఆ రోజు రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దివ్య ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో న్యూపోర్టు పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు మంగళవారం తెలిపారు.

News April 2, 2025

విశాఖ: టీచర్ల సమస్యలపై ప్రభుత్వ విప్‌‌కు వినతి

image

రాష్ట్రంలోని ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ వేపాడ చిరంజీవి రావుని మంగళవారం ఏపీటీఎఫ్ యూనియన్ నేతలు కలిసి వినతి పత్రం అందజేశారు. విశాఖలోని ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కార్యాలయంలో సమావేశమైన యూనియన్ నాయకులు, ఉపాధ్యాయుల జీత భత్యాలు, పదోన్నతులు, బదిలీలతో పాటు ఇతర సమస్యలపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.

error: Content is protected !!