News April 15, 2025
విశాఖ: అమ్మతోనే నేను..!

మధురవాడ సమీపంలో కీచక భర్త చేతిలో హత్యకు గురైన నిండు గర్భిణి <<16097534>>అనూష<<>> మృతదేహానికి వైద్యులు మంగళవారం పోస్టుమార్టం పూర్తి చేశారు. ఆమెకు నెలలు నిండటంతో గర్భంలోనే ఆడ శిశువు మృతి చెందింది. మృతి చెందిన పసికూనను వైద్యులు బయటకు తీశారు. ‘నవమాసాలు మోసిన మీ అమ్మతోనే నువ్వు వెళ్లిపోతున్నావా’ అంటూ కుటుంబ సభ్యులు విలపించారు. మానవత్వానికి మచ్చ తెచ్చే ఈ ఘటనపై పెద్దఎత్తున మండిపడుతున్నారు.
Similar News
News December 7, 2025
విశాఖ: ప్రభుత్వ కార్యాలయంలో రేపు పీజీఆర్ఎస్

విశాఖ సీపీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు సీపీ శంక బ్రత బాగ్చి తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. GVMC ప్రధాన కార్యాలయం, జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్ కార్యలయంలో ఉదయం వినతులు స్వీకరించనున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

విశాఖ: రోడ్డు ప్రమాదంలో స్టీల్ ప్లాంట్ కార్మికుడి మృతి

విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో చిన్నారావు తన బైక్పై ఇంటికి వెళుతుండగా వడ్లపూడి బ్రిడ్జిపై ఓ వాహనం ఢీంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలిని పరిశీలించిన దువ్వాడ పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు.