News November 22, 2024
విశాఖ, అరకులో యాంకర్ హబ్‌లు: మంత్రి దుర్గేశ్
విశాఖ, అరకులో యాంకర్ హబ్‌లు ఏర్పాటు చేస్తామని టూరిజం మంత్రి కందుల దుర్గేశ్ అసెంబ్లీలో ప్రకటించారు. తొట్లకొండతో పాటు పలు బౌద్ధ క్షేత్రాలను అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ నుంచి క్రూయిజ్ సేవలు విస్తరిస్తామన్నారు. బీచ్ టూరిజం సర్క్యూట్‌లో భాగంగా విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో బీచ్‌ల అభివృద్ధితో పాటు ఎకో టూరిజాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. బొర్రా గుహలను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
Similar News
News December 3, 2024
విశాఖ: ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్
విశాఖ నగరం కనకమహాలక్ష్మి ఆలయంలో ప్రారంభమైన మార్గశిర మాసోత్సవాల ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ సోమవారం పరిశీలించారు. ఆలయానికి విచ్చేసిన ఆయన ఏర్పాట్ల గురించి ఈవో శోభారాణిని అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్స్ మధ్య ఎమర్జెన్సీ గేట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని మార్గాల వద్ద సూచన బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
News December 2, 2024
విశాఖలో ఈనెల 30న పోస్టల్ అదాలత్ నిర్వహణ
పోస్టల్ డాక్/పెన్షన్ అదాలత్‌ను ఈ నెల 30న ఉదయం 11.00 గంటలకు ఎంవీపీ కాలనీలోని పోస్టల్ అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్ భవనంలో నిర్వహించనున్నట్లు ఆర్.ఎం.ఎస్. -వి- డివిజన్ సూపరింటెండెంట్ ప్రసన్నరెడ్డి తెలిపారు. ఆర్.ఎం.ఎస్.(రైల్వే మెయిల్ సర్వీసెస్) -వి- డివిజన్ పరిధిలోని ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన తపాలా సేవలు, పింఛన్లపై ఫిర్యాదులు 23 వరకు స్వీకరిస్తారు.
News December 2, 2024
విశాఖలో 9 స్పెషల్ ఎకనామిక్ జోన్లు ఏర్పాటు..!
ఏపీలో జిల్లాల వారీగా మొత్తం 34 స్పెషల్ ఎకనామిక్ జోన్లు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిలో ఉమ్మడి విశాఖ జిల్లాలో 9 ఆర్థిక మండలాలు ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పరవాడ మండలం ఈ.బోనంగి, విశాఖ గ్రామీణ ప్రాంతం మధురవాడ, రేసపువానిపాలెం, నక్కపల్లి మండలం, అచ్యుతాపురం, రాంబిల్లి మండలాలు, జి.కోడూరు ప్రాంతాలు ఉన్నాయి.