News December 23, 2024
విశాఖ-అరకు ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైళ్లు
సంక్రాంతి సీజన్ సందర్భంగా ఈ నెల 28 నుంచి వచ్చే నెల 19 వరకు ప్రతి శని, ఆదివారాల్లో విశాఖ నుంచి ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేరు రైల్వే డీసీఎం కే.సందీప్ తెలిపారు. ఈ రైలు వైజాగ్ నుంచి ఉదయం 8:30 గంటలకు బయలుదేరి అరకు 11.45 గంటలకు చేరుకుంటుందన్నారు. అలాగే తిరుగు ప్రయాణంలో ఇవే తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయన్నారు.అరకులో మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరతాయని తెలిపారు.
Similar News
News December 24, 2024
ఎలమంచిలి: బీజేపీలో చేరనున్న ఆడారి కుటుంబం?
వైసీపీకి రాజీనామా చేసిన విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్, ఆయన సోదరి ఎలమంచిలి మున్సిపల్ ఛైర్పర్సన్ రమాకుమారి బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. మంగళవారం ఎలమంచిలిలో మున్సిపల్ ఛైర్ పర్సన్ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులతో సమావేశం నిర్వహించడంతో దీనికి మరింత బలం చేకూరింది. ఈనెల 25న రాజమండ్రిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటారంటూ వైరల్ అవుతోంది.
News December 24, 2024
ఈనెల 27న ధర్నా చేస్తాం: విజయసాయిరెడ్డి
విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా ఈనెల 27న వైసీపీ ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి తెలిపారు. మంగళవారం మద్దిలపాలెం జిల్లా పార్టీ కార్యాలయంలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీలు పెంచబోమని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.
News December 24, 2024
టీం ఇండియాలో స్థానమే లక్ష్యం: అవినాశ్
టీం ఇండియాలో స్థానం సంపాదించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నట్లు విశాఖకు చెందిన ఆంధ్ర రంజీ క్రికెటర్ పైల అవినాశ్ తెలిపారు. సోమవారం ఆయన సింహాచలంలో మాట్లాడుతూ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్కు ఇటీవల జరిగిన వేలంలో రూ.30 లక్షలకు పంజాబ్ కింగ్స్ జట్టుకు ఎంపికైనట్లు వెల్లడించారు. టోర్నీలో ప్రతిభ కనబరిచి తన కలసాకారం చేసుకునే దిశగా సాధన చేస్తున్నట్లు వెల్లడించారు.