News January 21, 2025

విశాఖ: అలా చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష..!

image

విశాఖలో DMHO కార్యాలయంలో ప్రభుత్వ,ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లకు మహిళల హక్కుల పరిరక్షణ, లింగ వివక్షపై అవగాహన నిర్వహించారు. డిస్ట్రిక్ట్ సీనియర్ సివిల్ జడ్జ్ వెంకట శేషమ్మ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. హాస్పిటల్లో లింగ నిర్ధారణ చేయకూడదని, అలా చేస్తే మొదటిసారి రూ.10వేలు జరిమానా, 3ఏళ్లు జైలు శిక్ష, రెండో సారి లక్ష రూపాయల జరిమానా, 5ఏళ్ల జైలు శిక్ష, నేరం నిరూపణ ఐతే రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామన్నారు.

Similar News

News April 14, 2026

విశాఖ జూలో సింహం మృతి

image

విశాఖలోని ఇందిర గాంధీ జూపార్కులో ‘లియో’ అనే 7 సంవత్సరాల మగ ఆసియాటిక్ సింహం మంగళవారం మృతి చెందింది. అస్సాం నుంచి జంతు మార్పిడి కార్యక్రమం ద్వారా తీసుకువచ్చిన ఈ సింహం క్వారంటైన్‌లో ఉండగా అనారోగ్యానికి గురైంది. మార్చి 19న పరీక్షల్లో ట్రైపానోసోమియాసిస్, ఎర్లిచియోసిస్ అనే రక్త సంబంధిత వ్యాధులు ఉన్నట్లు తేలింది.ఈ వ్యాధుల ప్రభావంతో అవయవాలు పనిచేయకపోవడంతో సింహం మృతి చెందినట్లు జూ క్యూరేటర్ తెలిపారు.

News April 14, 2026

విశాఖ: రేపే ఇంటర్ ఫలితాలు.. 83,346 మంది ఎదురుచూపు

image

ఇంటర్ ఫలితాలు రేపు ఉదయం 10:31 గంటలకు విడుదల కానున్న నేపథ్యంలో విశాఖ జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో40,653 మంది, ద్వితీయ సంవత్సరంలో42,693 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారికి ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. అందరికంటే ముందుగా ఫలితాలను Way2News యాప్‌లో చూసుకోవచ్చు.