News October 13, 2024

విశాఖ: ‘అల్పపీడనం ఏర్పడే అవకాశం’

image

ఐఎండి సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతున్నట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలకు అవకాశముందని వెల్లడించారు. ఈనెల 14 నుంచి 17 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.

Similar News

News July 11, 2025

విశాఖలో మెట్రోకు సెప్టెంబర్‌లో శంకుస్థాపన: గండి బాబ్జి

image

విశాఖలో మెట్రోకు సెప్టెంబర్‌లో శంకుస్థాపన చేపట్టనున్నట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జి వెల్లడించారు. శుక్రవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఉమ్మడి విశాఖలోని సుమారు 300 గ్రామాల్లో గంజాయి సాగును నిర్మూలించి ఉద్యానవనాల పెంపునకు కృషి చేస్తున్నామన్నారు.

News July 11, 2025

విశాఖలో ఈసాయ్ సంస్థ విస్తరణ

image

విశాఖపట్నంలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఈసాయ్ ఫార్మాస్యూటికల్స్ నిర్ణయించింది. 2026 ఫిబ్రవరి నాటికి ఈ కేంద్రం పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇప్పటికే జేఎన్ ఫార్మా సిటీలో తయారీ ప్లాంట్‌ను నిర్వహిస్తున్న ఈసాయ్ సంస్థ ఈ కొత్త కేంద్రంతో భారత్‌లో తన ఉనికిని మరింతగా బలోపేతం చేయనుంది.

News July 11, 2025

షీలానగర్‌లో యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

షీలానగర్ సమీపంలోని మారుతి సర్కిల్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పరవాడకు చెందిన అశోక్ రెడ్డి బైకుపై వెళుతుండగా ట్రాలర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎయిర్ పోర్ట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గతంలో కూడా ఇదే ఏరియాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు.