News December 5, 2024

విశాఖ: ఆటో.. అగ్గిపుల్ల.. ఓ అంగన్వాడీ టీచర్..!

image

అక్కయ్యపాలెంలో అంగన్వాడీ టీచర్ రహీమున్నీసాబేగంపై <<14787594>>పెట్రోల్ దాడి<<>> ఘటనలో సంగీత అనే మహిళపై కేసు నమోదైంది. గోపాలపట్నంకి చెందిన సంగీత, రహిమున్నీసాబేగంకి రూ.35 వేలు అప్పుగా ఇచ్చింది. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోవడంతో బుధవారం పెట్రోల్ తీసుకుని అంగన్వాడీ కేంద్రానికి వచ్చింది. ఇద్దరూ <<14788224>>ఆటోలో<<>> కూర్చొని మాట్లాడుతుండగా.. పెట్రోల్ పోసి అగ్గిపుల్లతో నిప్పంటించినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది.

Similar News

News January 22, 2026

30న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం

image

విశాఖ నగరపాలక సంస్థకు ఈ నెల 30న సాధారణ కౌన్సిల్ సమావేశం, ఫిబ్రవరి 4న 2026–27 వార్షిక బడ్జెట్‌కు ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు మేయర్ పీలా శ్రీనివాసరావు గ్రేటర్ కమిషనర్ కేతన్ గార్గ్‌కు ప్రతిపాదనలు పంపారు. రూ.50 లక్షల పనుల అనుమతులపై ఈ నెల 27న స్థాయి సంఘం సమావేశం జరగనుంది. పాలకవర్గ పదవీకాలం మార్చి 18తో ముగియనుండగా, మార్చి 7 తర్వాత కౌన్సిల్ సమావేశాలకు నిబంధనల ప్రకారం అవకాశం లేదు.

News January 22, 2026

విశాఖలో బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ కార్యాలయం

image

విశాఖపట్నంలో కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఇమ్మిగ్రేషన్ బ్యూరో కార్యాలయం ఏర్పాటు కానుంది. దీంతో ఉత్తరాంధ్ర ప్రజలకు విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలు విశాఖలోనే అందుబాటులోకి వస్తాయి. హైదరాబాద్, చెన్నైపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. హోం మంత్రిత్వ శాఖ విశాఖ నగరంలోని మారిక వల్ల సమీపంలోని ఓజోన్ వ్యాలీ లేఔట్‌లో ఏర్పాటుకు చర్యలు మొదలుపెట్టింది.

News January 22, 2026

విశాఖ: కాంబోడియాకు యువతను తరలిస్తున్న వ్యక్తిపై పీడీ యాక్ట్

image

కాంబోడియాకు యువతను విశాఖ నుంచి తరలిస్తున్న ప్రధాన ఏజెంటు బొంగు మురళిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానికంగా భావన ఫ్యాబ్రికేటర్స్ వర్క్ ఏర్పాటు చేసి ఉపాధి పేరుతో యువకులను కాంబోడియా తరలిస్తుండగా గతంలో అరెస్టు చేశారు. మరోసారి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆయనపై పీడీ యాక్ట్ పెడుతున్నట్లు తెలిపారు.