News March 29, 2025

విశాఖ: ఆరు నెల‌ల్లో మెట్రో భూసేక‌ర‌ణ‌కు చ‌ర్య‌లు

image

విశాఖ‌లో చేప‌ట్ట‌నున్న మెట్రో రైలు ప్రాజెక్టు‌కు 6 నెల‌ల్లో మొద‌టి ద‌శ భూసేక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాలని అధికారుల‌ను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అప్ర‌మ‌త్తం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. మాస్ట‌ర్ ప్లాన్ రోడ్ల‌కు సంబంధించి కార్యాచ‌ర‌ణ మొద‌లు పెట్టాల‌ని, మెట్రో ప్రాజెక్టు, మాస్ట‌ర్ ప్లాన్ రోడ్డు వేసే మార్గంలో కొత్త‌గా ఎలాంటి అనుమ‌తులు ఇవ్వకూడదని ఆదేశించారు.

Similar News

News April 25, 2025

విశాఖలో చంద్రమోలి అంతిమ యాత్ర

image

పహల్గాంలో ఉగ్రమూకల కాల్పుల్లో మరణించిన చంద్రమోలి అంతిమ యాత్ర విశాఖలో ప్రారంభమైంది. పాండురంగాపురంలో ఆయన పార్థివదేహానికి మంత్రులు అనిత, సత్యకుమార్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ నివాళులు అర్పించి పాడె మోశారు. జ్ఞానాపురం శ్శశాన వాటికలో ఆయన దహన సంస్కణలు పూర్త చేయనున్నారు.

News April 25, 2025

విశాఖ జూలో వేసవి తాపానికి చెక్

image

వేసవికాలం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో విశాఖ జూ పార్కులో వన్యప్రాణుల వేసవితాపం జూక్యూరేటర్ మంగమ్మ, సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టారు. కొన్ని రకాల జంతువుల వద్ద వాటర్ స్పింక్లర్లు ఏర్పాటు చేయడం, సాదు జంతువులకు వాటర్ స్ప్రే చేయడం, కొన్ని రకాల పక్షులకు, జంతువులకు ఎయిర్ కండిషన్స్ ఏర్పాటు చేయడం వంటి సదుపాయాలు కల్పించారు.అదేవిధంగా వాటర్ మిలన్, కర్బూజా వంటి చల్లని పదార్థాలు అందజేస్తారు.

News April 25, 2025

విశాఖలో నేడు చంద్రమౌళి అంత్యక్రియలు

image

కశ్మీర్ ఉగ్రవాద దుర్ఘటనలో మృతి చెందిన చంద్రమౌళి అంత్యక్రియలు విశాఖలో శుక్రవారం ఉదయం 11.30 గంటలకు నిర్వహించనున్నారు. హోం మంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అధికార లాంఛనాలతో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రమౌళి మృతదేహానికి గురువారం రాత్రి ఘన నివాళులర్పించారు.

error: Content is protected !!