News February 21, 2025

విశాఖ: ఆర్డీఓపై చర్యలు చేపట్టాలి: ఏపీయూడబ్ల్యూజే

image

విశాఖ ఆర్డీఓ శ్రీలేఖపై ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని అనకాపల్లి జిల్లా ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు పెంటకోట జోగినాయుడు, కార్యదర్శి కె.చంద్ర రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నేతలంతా కలెక్టర్ విజయకృష్ణణ్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదిచ్చారు. సంఘం రాష్ట్ర నాయకులు స్వామి, కిషోర్, మద్దాల రాంబాబు, ఆళ్ల వెంకట అప్పారావు, అనకాపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మళ్ల భాస్కరరావు పాల్గొన్నారు.

Similar News

News February 23, 2025

విశాఖలో నకిలీ పోలీస్ అరెస్ట్

image

విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పోలీస్‌ను ఎయిర్ పోర్ట్ సీఐ ఉమామహేశ్వరరావు శనివారం అరెస్ట్ చేశారు. NAD, శాంతినగర్ పార్క్ ఏరియాలో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయనగరానికి చెందిన నిందుతుడు బోను దుర్గారావును అరెస్ట్ చేశారు. రెండు నకిలీ పోలీసు గుర్తింపు కార్డులు, బెదిరించి దోచుకున్న స్కూటీ‌తో పాటు ఒక మొబైల్ ఫోన్ సీజ్ చేసి రిమాండ్‌కు తరలించారు.

News February 23, 2025

మిస్సింగ్ కేసులను ఛేదించిన విశాఖ పోలీసులు

image

విశాఖ టూ టౌన్ స్టేషన్ పరిధిలో విశాఖ, విజయనగరానికి చెందిన రెండు మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మిస్సింగ్ కేసులపై టూ టౌన్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేసి గుర్తించారు. ఇద్దరు మహిళలను శనివారం వారి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. రెండు మిస్సింగ్ కేసులను ఛేదించిన టూ టౌన్ పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.

News February 23, 2025

దువ్వాడ మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు

image

దువ్వాడ మీదుగా సంబల్ పూర్ – ఈరోడ్ (08311/12), భువనేశ్వర్ – యస్వంత్ పూర్ (02811/12)రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. ప్రయాణీకుల రద్దీని నియంత్రించేందుకు మార్చి 12 నుంచి ఏప్రిల్ 30 వరకు ప్రతి బుధవారం సంబల్‌పూర్ – ఈరోడ్, మార్చ్ 1నుంచి ఏప్రిల్ 26వరకు ప్రతి శనివారం భువనేశ్వర్ – యస్వంత్ పూర్ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వెల్లడించారు.. ప్రయాణికులు గమనించాలన్నారు.

error: Content is protected !!