News March 8, 2025
విశాఖ: ఆల్-ఉమెన్ క్రూ స్పెషల్ రైలు ప్రారంభం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని విశాఖ రైల్వే స్టేషన్ లో ఆల్-ఉమెన్ క్రూ స్పెషల్ రైలును శనివారం ప్రారంబించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే మహిళా సంక్షేమ సంస్థ వాల్తేర్ డివిజన్ అధ్యక్షురాలు జ్యోత్స్న బోహ్రా జెండా ఊపి ప్రారంభించారు. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు పూర్తిగా మహిళా సిబ్బందితో ఈ రైలు ప్రయాణం చేస్తుందన్నారు. విశాఖపట్నం స్టేషన్‌లో పలువురు మహిళా స్వచ్ఛ సేవకులను సత్కరించారు.
Similar News
News March 21, 2025
జీవీఎంసీకి పన్ను చెల్లించిన స్టీల్ ప్లాంట్ యాజమాన్యం

విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం జీవీఎంసీకి ఈ ఏడాది పన్నును చెల్లించింది. మార్చి 31వ తేదీకి ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో శుక్రవారం జీవీఎంసీ గాజువాక జోన్ అధికారులకు పన్ను మొత్తం రూ.3,41,47,156 స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చెల్లించింది. గాజువాక జోనల్ కమిషనర్ శేషాద్రి, అసిస్టెంట్ కమిషనర్ రామ్ నారాయణ, ఆర్‌ఐ శివకు విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారులు శుక్రవారం చెక్కు అందజేశారు.
News March 21, 2025
విశాఖలో ఇంగ్లిష్ పరీక్షకు 78 మంది గైర్హాజరు

విశాఖలో శుక్రవారం పదవ తరగతి ఇంగ్లీష్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 28,609 మంది పరీక్షలకు హాజరు కావలసి ఉండగా 28,531 మంది హాజరైయారు. 78 మంది పరీక్షకు హాజరు కాలేదు. అయితే బుధవారం 72 పరీక్ష కేంద్రాలను డీఈవో ప్రేమకుమార్, స్క్వాడ్ బృందాలు సందర్శించారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
News March 21, 2025
విశాఖ మేయర్ పీఠం కదలనుందా?

విశాఖ మహా నగర మేయర్ హరివెంకటకుమారిపై ఆవిశ్వాసం తప్పేలా లేదు. ఈ క్రమంలో కూటమి నాయకులు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం కూటమి బలం ఎక్స్అఫీషియో సభ్యులతో కలిపి70కి చేరుకుంది. మరికొన్ని రోజులలో TDP, జనసేనలో కార్పొరేటర్లు చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. TDP ఫ్లోర్లీడర్ పీలా శ్రీనివాస్ కలెక్టర్ &జీవీఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్ హరేదేంద్రప్రసాద్‌ని కలిసి అవిశ్వాస తీర్మాన లేఖ ఇవ్వనున్నట్టు సమాచారం.