News January 29, 2025
విశాఖ: ఆసక్తి గలవారు అప్లే చేసుకోండి..!

విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో న్యాయ సహాయకుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకట శేషమ్మ తెలిపారు. పదో తరగతి పూర్తయిన వారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు దరఖాస్తుతో పాటు, ఆధార్ కార్డు జిరాక్స్, విద్యార్హత ధ్రువపత్రాలు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోతో జిల్లా కోర్టులో న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయంలో జనవరి 31 లోపు అందజేయాలన్నారు. ఎటువంటి జీతం ఉండదని తెలిపారు.
Similar News
News February 7, 2025
విశాఖ మీదుగా వెళ్లే యశ్వంత్పూర్ రైలు రద్దు

టాటా నగర్ నుంచి విశాఖ మీదగా యశ్వంత్పూర్ వెళ్లే రైలును(18111/12) ఫిబ్రవరి 6,13 తేదీలలో రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ తెలిపారు. ఖమ్మం డివిజన్‌లో ఇంటర్ లాకింగ్, నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపట్టడం వలన రైలును రద్దు చేసినట్లు తెలిపారు. యశ్వంత్పూర్ నుంచి విశాఖ మీదగా టాటానగర్ వెళ్లే రైలు కూడా ఫిబ్రవరి 6,13 తేదీలలో రద్దు చేశామన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News February 7, 2025
విశాఖ: టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి మరో నామినేషన్

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి శుక్రవారం నాలుగు నామినేషన్‌లు దాఖలు అయ్యాయి. పీఆర్టీయూ మద్దతుతో బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, స్వతంత్ర అభ్యర్థులు నూకల సూర్యప్రకాష్,రాయల సత్యన్నారాయణ, పోతల దుర్గారావు తమ మద్దతుదారులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ వారి చేత ప్రమాణం చేయించారు.ఇప్పటి వరకు మొత్తం 8 నామినేషన్లు వచ్చాయి.
News February 7, 2025
కేజీహెచ్‌లో బాలిక ప్రసవం.. మరణించిన శిశువు

కేజీహెచ్‌లో <<15384408>>బాలిక ప్రసవించిన <<>>ఘటనలో విషాదం చోటుచేసుకుంది. నెలలు నిండకముందే ఆరునెలల మగబిడ్డకు జన్మనివ్వగా ఆ శిశువు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆ బాలిక భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కళాశాలలో చదువుతుంది. ప్రేమ పేరుతో శారీరకంగా కలిసిన ఓ యువకుడు ఆమెను గర్భవతి చేశాడు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి చీడికాడ స్టేషన్‌కు కేసు బదిలీ చేసినట్లు భీమిలి సీఐ సుధాకర్ తెలిపారు.