News September 15, 2024

విశాఖ: ఆ రైలు 5 గంటల ఆలస్యం

image

సంత్రాగచ్చి-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు(07222) ఈరోజు 5 గంటల ఆలస్యంగా ప్రారంభం కానుంది. సంత్రాగచ్చి నుంచి 12:20 గంటలకు బయల్దేరాల్సి ఉండగా.. ఇవాళ సాయంత్రం 05:20 గంటలకు అక్కడ రైలు కదులుతుంది. ఈ ట్రైన్ దువ్వాడ స్టేషన్‌కు సోమవారం ఉదయం 8:20 గంటలకు చేరుతుంది. లింక్ రైలు ఆలస్యంగా నడుస్తున్నందున ఈ అసౌకర్యం కలిగినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

Similar News

News October 8, 2024

విశాఖ: టెట్ పరీక్షకు 84 శాతం మంది హాజరు

image

జిల్లాలో సోమవారం నిర్వహించిన టెట్ పరీక్షకు 84.36 శాతం మంది హాజరైనట్లు డీఈవో చంద్రకళ తెలిపారు. ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం 4610 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 3889 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. ఉదయం 5 పరీక్ష కేంద్రాల్లోనూ మధ్యాహ్నం 5 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించినట్లు వివరించారు. తాను ఒక పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేయగా ఫ్లయింగ్ స్క్వాడ్ 2 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు.

News October 7, 2024

విశాఖ: ఢిల్లీలో జరిగిన సదస్సులో పాల్గొన్న హోంమంత్రి

image

ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు నిర్వహించిన సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం తరపున అనిత పాల్గొన్నారు. మావోయిస్టుల కట్టడి, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి, కార్యచరణ ప్రణాళికపై ప్రధానంగా చర్చ జరిగినట్లు హోం మంత్రి తెలిపారు.