News September 25, 2024

విశాఖ: ఇంటిలిజెన్స్ ఎస్పీగా ఫకీరప్ప

image

విశాఖలో జాయింట్ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఫకీరప్పను ఇంటెలిజెన్స్ ఎస్పీగా ప్రభుత్వం బదిలీ చేసింది. బుధవారం రాష్ట్రంలో 16 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో భాగంగా విశాఖ DCP-2 గా మేరీ ప్రశాంతి నియమితులయ్యారు. DCP-2 గా విధులు నిర్వహిస్తున్న తూహిన్ సిహ్నాను అనకాపల్లి ఎస్పీగా బదిలీ చేశారు. అనకాపల్లి ఎస్పీ దీపికను కాకినాడ 3వ బెటాలియన్ కమాండెంట్‌గా బదిలీ చేశారు.

Similar News

News October 11, 2024

విశాఖ: ‘విన్యాసాలతో బంధం బలోపేతం’

image

ఇండో పసిఫిక్ ప్రాంతంలో వాణిజ్యం, భద్రత అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు విశాఖ నౌకాదళ అధికారులు పేర్కొన్నారు. విశాఖ తీరంలో నిర్వహిస్తున్న మలబార్-2024 విన్యాసాల్లో వివిధ అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ విన్యాసాల్లో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ విన్యాసాలతో ఆయా దేశాల మధ్య బంధం బలోపేతం అవుతుందని వైస్ అడ్మిరల్ రాజేశ్ పెంధార్కర్ తెలిపారు.

News October 11, 2024

విద్యుత్ కాంతుల వెలుగులో శంఖు, చక్ర నామాలు

image

వరహా లక్ష్మీ నరసింహ స్వామి కొలువైన ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం సింహగిరిపై (సింహాచలం) స్వామి వారి శంఖు, చక్ర, నామాలు విద్యుత్ దీప కాంతులతో వెలుగొందుతున్నాయి. దాతల సహాకారంతో నిర్మించిన చేపట్టగా శంఖు, చక్ర, నామాలు ఎట్టకేలకు గురువారం ప్రారంభించారు. విద్యుత్ దీప కాంతులతో అద్భుతంగా దర్శనమిస్తున్న తిలకిస్తున్న భక్తులు ఆనందంతో పులకించి పోతున్నారు.

News October 11, 2024

విశాఖ నుంచి విజయవాడకు కొత్త విమాన సర్వీసులు

image

ఈనెల 27 నుంచి విశాఖ-విజయవాడ-విశాఖకు రెండు కొత్త విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సంస్థ ప్రారంభించనుంది. 29న విజయవాడ నుంచి విశాఖకు ఇదే సంస్థ మరో సర్వీస్ ప్రారంభించనుంది. ఇందులో ఓ సర్వీసు వారం రోజులు అందుబాటులో ఉంటుంది. ఇది విజయవాడ నుంచి విశాఖకు ఉదయం 10:35 గంటలకు వచ్చి తిరిగి మధ్యాహ్నం బయలుదేరుతుంది.