News April 29, 2024
విశాఖ: ఇకే గ్రామానికి చెందిన యువకులు మృతి

ఇటీవల గొడిచర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఇద్దరు ఫార్మా ఉద్యోగులు విశాఖలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ మేరకు నక్కపల్లి మండలం రేబాక గ్రామానికి చెందిన ఎస్.రాము రెండు రోజుల క్రితం మృతి చెందగా, ఎస్.పొట్టియ్య ఈ రోజు మృతి చెందారు. ఇద్దరు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
Similar News
News December 11, 2025
రాత్రికి విశాఖ చేరుకోనున్నమంత్రి లోకేశ్

రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం రాత్రి విశాఖ చేరుకోనున్నారు. రాత్రి 9 గంటలకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్తారు. డిసెంబరు 12న శుక్రవారం మధురవాడ ఐటీ హిల్స్‌లో పలు ఐటీ సంస్థల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం కాపులుప్పాడలో జరిగే కాగ్నిజెంట్ కంపెనీ భూమి పూజ కార్యక్రమానికి హాజరవుతారు.
News December 11, 2025
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన జీవీఎంసీ కమిషనర్

సీఎం చంద్రబాబు రేపు కపులుప్పాడలో కాగ్నిజెంట్ సహా ఐటీ పరిశ్రమల శంకుస్థాపనకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం భీమిలి–కపులుప్పాడ ప్రాంతాల్లో ఏర్పాట్లు పరిశీలించారు. రోడ్లు, భద్రత, పార్కింగ్ వంటి ఏర్పాట్లను స్వయంగా తనిఖీ చేశారు. సీఎం పర్యటనలో లోపాలేమీ లేకుండా పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
News December 11, 2025
విశాఖ వేదికగా పెన్షన్ అదాలత్

విశాఖపట్నంలో డిసెంబర్ 19న ‘పెన్షన్ అదాలత్’ కార్యక్రమం జరగనుంది. సిరిపురం వుడా చిల్డ్రన్స్ థియేటర్‌లో జరిగే ఈ సదస్సుకు ఏపీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శ్రీమతి ఎస్.శాంతి ప్రియ హాజరవుతారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారం, డీడీవోలకు సరైన మార్గనిర్దేశం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఉద్యోగులు, పెన్షనర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.


