News January 2, 2025

విశాఖ: ఇగ్నోలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో (ఇగ్నో) ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విశాఖ ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్‌ జి.ధర్మారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ, పీజీ, డిప్లమో సర్టిఫికెట్ కోర్సుల్లో పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో ప్రవేశాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈనెల 31వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాలకు ఎంవీపీ కాలనీలో ఇగ్నో కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.

Similar News

News November 16, 2025

విశాఖ: ప్రభుత్వ కార్యాలయాలలో రేపు పీజీఆర్ఎస్

image

విశాఖ కలెక్టరేట్‌లో ఈనెల 17న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. అదేవిధంగా సీపీ, జీవీఎంసీ ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినతులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

News November 16, 2025

కంచరపాలెంలో చెట్టుకు వేలాడుతున్న మృతదేహం

image

కంచరపాలెంలోని ఓ చెట్టుకు వేలాడుతున్న వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు శనివారం గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో కంచరపాలెం సీఐ రవికుమార్ సంఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. పదిరోజుల క్రితమే ఈ ఘటన జరిగి ఉండవచ్చని, మృతుని వయస్సు సుమారు 35-40 ఏళ్లు ఉంటుందని సీఐ తెలిపారు. మృతుని వివరాలు తెలియరాలేదని, దీనిని అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ చెప్పారు

News November 16, 2025

జగదాంబ జంక్షన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

జగదాంబ జంక్షన్‌లోని బస్‌స్టాప్ వద్ద ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న మహారాణిపేట సీఐ దివాకర్ యాదవ్ సంఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుని వివరాలపై ఆరా తీశారు. మృతుని ఒంటిపై గాయాలు లేవని.. అయితే అనారోగ్యం కారణంగా చనిపోయాడా? ఇంకా ఏమైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతదేహాన్ని KGH మార్చురీకి తరలించామని అతని వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని సీఐ కోరారు.