News August 4, 2024
విశాఖ: ఇది కదా ఫ్రెండ్‌షిప్ అంటే..!
ఓ కంపెనీలో జాబ్ చేసేటప్పుడు ఏర్పడిన స్నేహం నేటికీ కొనసాగిస్తున్నారు. ఏటా స్నేహితుల దినోత్సవాన కలుస్తూ ఉంటారు. అయితే వారిలో కే.కోటపాడు మండలం పాచిలవానిపాలెంకి చెందిన అప్పారావుకు యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగింది. దీంతో ఈ ఏడాది మిగిలిన స్నేహితులు రూ.50 వేలు పోగు చేసి ‘ఫ్రెండ్‌షిప్ డే’న అందజేశారు. సుఖాల్లోనే కాదు.. కష్టాల్లోనూ ఆదుకున్నవారే స్నేహితులని నిరూపించారు. మరి మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా..?
Similar News
News September 7, 2024
విశాఖ: ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీఈపీడీసీఎల్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారనుందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొన్న నేపథ్యంలో ఏటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ శ్రీ పృథ్వీతేజ్ ఇమ్మడి సంస్థ పరిధిలోని 11 జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు.
News September 7, 2024
అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మీసాల సుబ్బన్న
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీసీసీ నూతన కమిటీలకు పిలుపునిచ్చింది. ఆంధ్ర కాంగ్రెస్ సిఫార్సు చేసిన కమిటీలకు ఏఐసీసీ ఆమోదం కూడా తెలిపింది. ఈ క్రమంలోనే 25 జిల్లాల డీసీసీలు, 13మంది వైస్ ప్రెసిడెంట్లు, 37 మంది జనరల్ సెక్రటరీలు, 10 మంది సిటీ ప్రెసిడెంట్లను ఏఐసీసీ ప్రకటించింది. దీనిలో AKP జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా మీసాల సుబ్బన్న నియమితులయ్యారు.
News September 7, 2024
విశాఖ: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాతంలో ఈ అల్ప పీడనం కొనసాగుతున్నదని, ఇది ఉత్తర దిశగా కదులుతూ ఈనెల తొమ్మిదవ తేదీకి ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం వివరించారు. దీని ప్రభావంతో కోస్తా జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు.