News March 9, 2025
విశాఖ: ఇన్‌ఛార్జ్ మంత్రితో సమావేశమైన జిల్లా కలెక్టర్, సీపీ

విశాఖలో శనివారం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామిని పోర్ట్ గెస్ట్ హౌస్‌లో జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, విశాఖ సీపీ శంఖ బ్రాత బాగ్చి కలిశారు. జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు గూర్చి మంత్రి అడిగి తెలుసుకున్నారు. P4 సర్వే సమర్థవంతంగా జరిగేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News March 10, 2025
విశాఖలో నేటి కూరగాయ ధరల వివరాలు

విశాఖలోని వ్యవసాయ, వాణిజ్య శాఖ అధికారులు సోమవారం నాటి కూరగాయ ధరలను విడుదల చేశారు. వాటి వివరాలు టమోటా కేజీ రూ.14 , ఉల్లిపాయలు కేజీ రూ.28 , బంగాళాదుంపలు కేజీ రూ.15, వంకాయలు రూ.22/24/32, బెండకాయలు రూ.44, మిర్చి రూ.24, బరబాటి రూ.36, క్యారెట్ రూ.24, బీరకాయలు రూ.50, వెల్లుల్లి రూ.60/80/90గా నిర్ణయించారు.
News March 10, 2025
వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తాం: విశాఖ సీపీ

విశాఖ సీపీ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్, సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వచ్చిన సమాచారంతో అల్లిపురానికి చెందిన ప్రధాన నిందితుడు నానాబల్ల గణేశ్వరరావును ఆదివారం అరెస్ట్ చేశారు. ఇతను మధ్యవర్తిగా బెట్టింగ్ లావాదేవీలు జరపుతుంటాడని పేర్కొన్నారు. వీరి ద్వారా ఇంకొందరు బుకీల సమాచారం వెలుగులోకి వచ్చిందని వారిని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు.
News March 10, 2025
విశాఖలో రౌడీ షీటర్స్‌కు కౌన్సెలింగ్

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు రౌడీషీటర్లకు సంబంధిత అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా SI సునీత ఆదివారం PMపాలెం పోలీస్ స్టేషన్ ఆవరణలో పలువురు రౌడీ షీటర్స్‌ను సత్ప్రవర్తనతో వ్యవహరించాలని సూచించారు. ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.