News October 22, 2024
విశాఖ: ఈనెల 23,24,25 తేదీలలో రైల్లు రద్దు
దానా తుఫాన్ నేపథ్యంలో ఈనెల 23 ,24, 25 తేదీల్లో పలు ట్రైన్లను రద్దు చేస్తున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కే.సందీప్ మంగళవారం వెల్లడించారు. తుఫాను నేపథ్యంలో ముందస్తుగా 23న సికింద్రాబాద్- భువనేశ్వర్- విశాఖ, హౌరా మెయిల్‌తో సహా 16, 24న హౌరా-MGR చెన్నై, విశాఖ భువనేశ్వర్ వందేభారత్, పూరి- తిరుమల సహా 35, 25న 11 ట్రైన్లు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు దీనిని గమనించాలని ఆయన కోరారు.
Similar News
News November 3, 2024
సిడ్నీ చేరుకున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు
ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి చేరుకున్నారు. న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్ ఆతిథ్యమిస్తున్న 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ (సీపీసీ)లో పాల్గొనడానికి ఆయన సిడ్నీకి వెళ్లారు. ఆయనతో పాటు శాసనసభ కార్యదర్శి ప్రసన్న కుమార్ సూర్యదేవర ఉన్నారు. అయ్యన్నపాత్రుడును సిడ్నీ విమానాశ్రయంలో అక్కడ నివసిస్తున్న తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు.
News November 3, 2024
విశాఖ: ‘అద్భుతమైన టూరిజం ప్రాజెక్టును నిర్మించాం’
గత ప్రభుత్వం గతంలో ఎక్కడాలేని విధంగా రుషికొండపై అద్భుతమైన టూరిజం ప్రాజెక్టును నిర్మించినట్లు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఆదివారం విశాఖలో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఇది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంతంగా నిర్మించుకున్నట్లుగా చెప్పడంపై మాజీ మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు.
News November 3, 2024
‘రుషికొండ భవనాలు చూసి ఆశ్చర్యపోయావా చంద్రబాబు’
సీఎం చంద్రబాబు నాయుడు విశాఖలోని రుషికొండపై ఉన్న భవనాలను శనివారం సందర్శించిన విషయం తెలిసిందే. విశాఖ ఎమ్మెల్యేలు దగ్గరుండి సీఎంకు భవనాలను చూపించారు. దీనిపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘రుషికొండ భవనాలు చూసి ఆశ్చర్యపోయావా!.. అమరావతిలో ఇలా కట్టలేదని సిగ్గుపడ్డావా?’ అంటూ ట్వీట్ చేశారు.