News February 25, 2025

విశాఖ: ఈనెల 27న పారిశుద్ధ్య కార్మికులకు సెలవు

image

జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు ఫిబ్రవరి 26వ తేదీన శివరాత్రి రోజున కార్మికులు విధులకు హాజరై యథావిధిగా వ్యర్థాలను సేకరిస్తారని జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి నరేశ్ తెలిపారు. దీంతో వారికి ఫిబ్రవరి 27న సెలవు ప్రకటించారు. నగర ప్రజలు ఫిబ్రవరి 27వ తేదీన వ్యర్థాలను వీధులలో, బహిరంగ ప్రదేశాలలో, పబ్లిక్ బిన్లలో పడేయవద్దని సూచించారు. ఫిబ్రవరి 28న(శుక్రవారం) పారిశుద్ధ్య సిబ్బందికి చెత్తను అందజేయాలన్నారు.

Similar News

News February 26, 2025

విశాఖ: గాయపడిన యువకుడి మృతి

image

విశాఖలో 22 ఏళ్ల యువకుడు చనిపోయాడు. మల్కాపురానికి చెందిన సిద్ధు శ్రీహరిపురం వద్ద సోమవారం రాత్రి పార్కింగ్ చేసిన బైకు తీస్తుండగా కిందపడి గాయపడ్డాడు. ప్రాథమిక చికిత్స తర్వాత ఇంటికి వెళ్లాడు. మంగళవారం ఉదయం అస్వస్థతకు గురికావడంతో KGHకు తరలించారు. అక్కడ అతను చనిపోయినట్లు మల్కాపురం సీఐ విద్యాసాగర్ తెలిపారు. మృతుడి సోదరుడు నవీన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

News February 26, 2025

బీచ్ రోడ్డులో కోటి లింగాలకు అభిషేకం

image

విశాఖ సాగర తీరంలో నేడు అద్భుత ఘటన జరగనుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా కోటి శివలింగాలకు అభిషేకం చేయనున్నారు. ప్రయాగరాజ్ మహాకుంభ మేళా నుంచి తెచ్చిన జలాలతో ఇలా చేయడం మరొక విశేషం. బీచ్ రోడ్డులో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మాజీ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ అద్భుత దృశ్యాలను కళ్లారా చూడండి. మిస్ కాకండి.

News February 26, 2025

విశాఖలో దారి దోపిడీ ముఠా అరెస్ట్

image

విశాఖలో దారి దోపిడీ ముఠాను త్రీటౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఫిషింగ్ హార్బర్ వద్ద ఫిబ్రవరి 22న ఉదయం మైలపల్లి చందర్రావు అనే వ్యక్తిని ముగ్గురు బైక్‌పై వచ్చి అడ్డుకున్నారు. అతని నుంచి రూ.350 నగదు, సెల్ ఫోన్ తీసుకొని తోసేసి వెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు గాలించారు. నిందితులు తీడా మోనేష్ బాబు(19), మరో ఇద్దరు మైనర్ యువకుల(17)ను అరెస్ట్ చేసి జువెనైల్ హోం, రిమాండ్‌కు తరలించారు.

error: Content is protected !!