News November 7, 2024

విశాఖ: ఈ నెల 14 నుంచి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ గ్రంథాలయాల్లో వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆర్‌సీ‌హెచ్.వెంకటరావు ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ పౌర గ్రంథాలలో మాట్లాడుతూ.. వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. విజేతలకు ముగింపు రోజున బహుమతులు అందజేస్తామన్నారు. అలాగే గ్రంథాలయాల్లో కవి సమ్మేళనాలు జరుగుతాయన్నారు.

Similar News

News December 6, 2024

విశాఖ: వేటలో మేమే మేటి.. మాకు లేరు ఎవ్వరూ సాటి!

image

ఆహార సంపాదనలో పెద్ద పులులు తమదైన శైలిలో వ్యవహరిస్తూ ఉంటాయి. వేటాడే సమయంలో అణకువను ప్రదర్శిస్తూ ఓపికతో వేచి చూసి ఒక్క ఉదుటున ఇతర జంతువులపై దాడి చేసి చంపి తింటాయి. ఈ క్రమంలో వాటి ఓపికకు, సహనానికి సలాం కొట్టాల్సిందే. విశాఖ జూ పార్కులో చెట్టుపై కట్టిన మాంసాన్ని ఒక్క ఉదుటున లాక్కుని తింటున్న టైగర్ విన్యాసాలు చూపరులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.

News December 6, 2024

విశాఖ: ‘ప్రజల ఆరోగ్యంపైనే దేశ ఆర్థిక అభివృద్ధి ఆధారపడి ఉంటుంది’

image

ప్రజల ఆరోగ్యం పైనే దేశ ఆర్థిక అభివృద్ధి ఆధారపడి ఉంటుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. డీప్ కాంక్లీవ్ పై విశాఖలో జరుగుతున్న సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యమే ఐశ్వర్వమని, అందుకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో ముందుకు వెళ్లేందుకు ఈ సదస్సు దోహదపడుతుందన్నారు.

News December 6, 2024

విశాఖలో సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే

image

 సీఎం చంద్రబాబు విశాఖ పర్యనటలో భాగంగా శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. మొదటి పార్టీ కార్యాలయంలో జరిగే అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కొంతసేపు పార్టీ నాయకులను, కార్యకర్తలతో భేటీ అవుతారు. 9:30 నిమిషాలకు నోవాటెల్‌లో “డీప్ టెక్నాలజీ సదస్సు- 2024″లో పాల్గొంటారు. సాయంత్రం వీఎంఆర్డీఏ అధికారులతో భేటీ అవుతారు. అనంతరం 06:45 ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని తిరిగి విజయవాడ వెళ్తారు.