News May 26, 2024

విశాఖ: ఈ నెల 27న MEMU రైళ్లు రద్దు

image

నౌపాడ- గుణుపూరు రైలు మార్గంలో అభివృద్ది పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా ఈ నెల 27వ తేదీన విశాఖ నుంచి గుణుపూరు వెళ్లే స్పెషల్ (08522) రైలు, విశాఖ నుంచి పలాస బయలుదేరు MEMU (07470) రైలు, అదే విధంగా గుణుపూరు నుంచి విశాఖ వచ్చు స్పెషల్ (08521) రైలు, పలాస నుంచి విశాఖ వచ్చు MEMU (07471) రైలు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Similar News

News December 23, 2025

ఇకపై ఆ స్టిక్కర్ ఉంటేనే ఏయూలోకి నేరుగా ప్రవేశం

image

ఏయూ ఉద్యోగులు, ఆచార్యులు, విద్యార్థుల వాహనాలకు ప్రత్యేకమైన స్టిక్కర్లను జారీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రిజిస్ట్రార్ పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు. తమ వాహనం నంబరు, ఇంజిన్ నంబరు, ఫోన్ నంబర్, లైసెన్స్ వంటి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలు పరిశీలించి సదరు ఉద్యోగికి సెక్యూరిటీ విభాగం నుంచి స్టిక్కర్ అందిస్తారు. భవిష్యత్తులో ఈ స్టిక్కర్ కలిగిన వాహనాలు నేరుగా వర్సిటీలోకి అనుమతిస్తారు.

News December 23, 2025

విశాఖలో అట్టహాసంగా ‘పీసా’ మహోత్సవం

image

విశాఖ పోర్ట్ స్టేడియంలో రెండు రోజుల పీసా (PESA) మహోత్సవం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్, కమిషనర్ కృష్ణతేజ, క్రీడాకారిణి జ్యోతి సురేఖ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 10 రాష్ట్రాల నుంచి వచ్చిన గిరిజనులు 68 స్టాళ్లతో తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఖేలో ఇండియా కబడ్డీలో మధ్యప్రదేశ్ (పురుషులు), జార్ఖండ్ (మహిళలు) విజేతలుగా నిలవగా, ఆర్చరీలో క్రీడాకారులు తమ ప్రతిభను చాటారు.

News December 23, 2025

వైద్యం ప్రైవేట్ పరమైతే ఊరుకోం: బొత్స

image

మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంచాలన్నది తమ పార్టీ విధానమని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ పేరుతో స్కాములకు పాల్పడితే వైసీపీ అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటుందన్నారు. కూటమి పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఆయన మండిపడ్డారు. రూ.లక్షల కోట్లు అప్పులు చేస్తున్నా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదని విమర్శించారు.