News May 26, 2024
విశాఖ: ఈ నెల 27న MEMU రైళ్లు రద్దు

నౌపాడ- గుణుపూరు రైలు మార్గంలో అభివృద్ది పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా ఈ నెల 27వ తేదీన విశాఖ నుంచి గుణుపూరు వెళ్లే స్పెషల్ (08522) రైలు, విశాఖ నుంచి పలాస బయలుదేరు MEMU (07470) రైలు, అదే విధంగా గుణుపూరు నుంచి విశాఖ వచ్చు స్పెషల్ (08521) రైలు, పలాస నుంచి విశాఖ వచ్చు MEMU (07471) రైలు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Similar News
News February 16, 2025
మహిళను బెదిరించిన వ్యక్తి అరెస్ట్: సైబర్ క్రైమ్ పోలీసులు

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇబ్బందులు పెడుతున్న వ్యక్తిని శనివారం రిమాండ్‌కు పంపించారు. నగరానికి చెందిన ఓ మహిళకు ఫేక్ ఇన్‌స్టా ద్వారా తన ఫేస్‌తో అశ్లీలంగా మార్ఫ్ చేసిన ఫొటోస్ వచ్చాయి. న్యూడ్ వీడియో కాల్ చేయాలని లేదంటే ఫొటోస్ ఫార్వార్డ్ చేస్తానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో కంచరపాలెంకు చెందిన వ్యక్తిగా గుర్తించి అరెస్ట్ చేశారు.
News February 16, 2025
డ్రైనేజీల్లో వ్యర్ధాలు వేసే వారికి ఫైన్ వేయండి: కలెక్టర్

విశాఖ నగర ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో జీవీఎంసీ అధికారులు సమిష్టిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. డ్రైనేజీల్లో వ్యర్ధాలు వేసే వారిని గమనించి అపరాద రుసుములను వసూలు చేయాలన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే ప్లానింగ్ కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 15, 2025
విశాఖలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు శనివారం గంజాయి రవాణా నియంత్రణలో భాగంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి రవాణా అరికట్టడానికి ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కొరియర్ ఆఫీసులు, పలు చోట్ల డాగ్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.