News March 25, 2025
విశాఖ : ఈ స్థానాలలో రిపోర్టర్లు కావలెను..!

విశాఖ నగరం కార్ షెడ్ , కొమ్మాది, రుషికొండ, సింహాచలం, దువ్వాడ, కూర్మన్నపాలెం, పాత గాజువాక, షీలానగర్, మర్రిపాలెం, ద్వారకానగర్ స్థానాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ <
Similar News
News April 24, 2025
ఈనెల 26న GVMC డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం

GVMC డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌పై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై సమావేశం ఈనెల 26న నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ గురువారం తెలిపారు. ఈనెల 26న ఉదయం 11 గంటలకు GVMC కౌన్సిల్ హల్లో నిర్వహించనున్నారు. ఆరోజున సమావేశానికి హాజరవుతున్న సభ్యులు మొబైల్ ఫోన్‌లను ఫ్లైట్ మోడ్‌లో పెట్టుకోవాలన్నారు. ఎక్స్ అఫీషియో మెంబర్లు, కార్పొరేటర్లకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
News April 24, 2025
పరిశ్రమలు నెలకొల్పే ఔత్సాహికులకు పూర్తి సహకారం: కలెక్టర్

పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే పారిశ్రామిక ఔత్సాహికులకు అన్ని విధాలుగా పూర్తి సహకారం అందించాలని అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. నిర్మాణాలకు, పరిశ్రమల నిర్వహణకు అవసరమైన నీటి వనరులను సమకూర్చాలన్నారు. భూ సేకరణ, సింగిల్ విండో క్లియరెన్స్ అంశాల్లో వేగం పెంచాలని ఆదేశించారు.
News April 24, 2025
దువ్వాడ మీదగా చర్లపల్లి, సంబల్ పూర్‌కు ప్రత్యేక రైళ్లు

వేసవి రద్దీ దృష్ట్యా దువ్వాడ మీదగా చర్లపల్లి, సంబల్ పూర్‌కు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ గురువారం తెలిపారు. విశాఖ -చర్లపల్లి (08579/80), ఈనెల 25 నుంచి మే 30 వరకు, సంబల్ – ఈ రోడ్డు (08311) మే 7 నుంచి జూన్ 25 వరకు ప్రత్యేక వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు నడపనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు గమనించాలన్నారు.