News August 29, 2024
విశాఖ ఉక్కు సీఎండీ పదవికి సెప్టెంబర్ 3న ఇంటర్వ్యూ

విశాఖ ఉక్కు ఛైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి సెప్టెంబర్ 3న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు తెలిపింది. ఉ.10 నుంచి 11 గంటల వరకు ఇంటర్వ్యూ ఉంటుందన్నారు. ఇందుకు దుర్గాపూర్ స్టీల్ ప్లాంటులో ఈడీ(వర్క్స్)గా పని చేస్తున్న దిప్తెందు ఘోష్, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ డైరెక్టర్ (ఫైనాన్స్) ఎస్. శక్తిమణి అనే ఇద్దరు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది.
Similar News
News December 3, 2025
BREAKING విశాఖ: స్పా సెంటర్పై దాడి.. ఐదుగురు అరెస్ట్

గాజువాక 80 ఫీట్ల రోడ్డులోని ఓ స్పా సెంటర్ పై సిటీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక విటుడు, ఆర్గనైజరు, మేనేజర్, ఇద్దరు మహిళలను సిటీ టాస్క్ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని గాజువాక పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేశారు. అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ జరిగినా సమాచారం ఇవ్వాలని టాస్క్ఫోర్స్ సీఐ అప్పలనాయుడు ప్రజలను కోరారు.
News December 3, 2025
అట్రాసిటీ కేసుల పరిష్కారంలో చొరవ చూపాలి: కలెక్టర్

SC, ST అట్రాసిటీ కేసుల పరిష్కారంలో అధికారులు, పోలీసులు ప్రత్యేక చొరవ చూపాలని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సాయం తీసుకొని త్వరగా ఫలితాలు వచ్చేలా చేయాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ సూచించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ మీటింగు హాలులో బుధవారం ఆయన సమీక్షించారు. అధికారులు ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవచూపాలన్నారు.