News January 12, 2025
విశాఖ: ఉద్యోగులకు VRS ప్రకటించిన స్టీల్ ప్లాంట్

విశాఖ స్టీల్ ప్లాంట్ యజమాన్యం ఉద్యోగులకు స్వచ్ఛంద పదవి విరమణ (వీఆర్ఎస్) పథకాన్ని శనివారం ప్రకటించింది. దీని ప్రకారం ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకుంటే మార్చి నెలాఖరులోగా సెటిల్మెంట్ చేస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. మొదటి విడత ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ఉన్న 500 మంది, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు 500 మందికి వీఆర్ఎస్ అమలు చేస్తారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు 15 ఏళ్ల సర్వీసు, 45 ఏళ్ల వయసు ఉండాలి.
Similar News
News February 24, 2026
సర్క్యులర్ ఎకానమీతో 10 మిలియన్ల ఉద్యోగాలు: పట్టాభిరామ్

విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కె.పట్టాభిరామ్ మాట్లాడారు. 2050 నాటికి సర్క్యులర్ ఎకానమీ ద్వారా 10 మిలియన్ల ఉద్యోగాలు వస్తాయన్నారు. ఏపీలో ఐదు సర్క్యులర్ ఎకానమీ పార్కులు, వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కలెక్టర్ హరేంధీర ప్రసాద్ పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరించగా, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ప్రభుత్వ ప్రోత్సాహకాలను వివరించారు.
News February 24, 2026
విశాఖ పోలీసుల అదుపులో క్రిప్టో కరెన్సీలో కేసులో కీలక సూత్రధారి

క్రిప్టో కరెన్సీ పేరుతో విశాఖలో వందల కోట్లు వసూలు చేసిన కీలక సూత్రధారుడుని సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితులు సోమవారం విశాఖ నగర పోలీస్ కమిషనర్‌కు PGRSలో ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించి రవి కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.రవి కిరణ్ తప్పు చేయలేదని సీఐ భవానీ ప్రసాద్ వాదిస్తుండగా.. బాధితులు మాత్రం మేము అతనికే సొమ్ము చెల్లించామని ఆధారాలు చూపిస్తున్నారు.
News February 24, 2026
రక్షణ రంగ అభివృద్ధికి ఏపీ కీలకం: జి. సతీష్ రెడ్డి

విశాఖ డిఫెన్స్ స్టార్టప్ సదస్సులో రక్షణ శాస్త్రవేత్త జి. సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తీరప్రాంతం, పారిశ్రామిక వసతులు రాష్ట్రానికి బలమని, స్టార్టప్స్ భాగస్వామ్యంతో అధునాతన పరికరాల తయారీ సాధ్యమని చెప్పారు. సముద్ర భద్రతే దేశ ఆర్థిక భద్రతకు మూలస్తంభమని, స్వదేశీ సాంకేతికతతో ఇండో-పసిఫిక్‌లో భారత ప్రయోజనాలను కాపాడవచ్చని వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా పేర్కొన్నారు.


