News April 5, 2025
విశాఖ: ఉరేసుకుని విశ్రాంత ఉద్యోగి మృతి

విశాఖలోని లాసన్స్‌బే కాలనీలో విశ్రాంత ఉద్యోగి గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలనీకి చెందిన డానియల్ మిల్టన్(64) ఏలూరు జిల్లా కోపరేటివ్ బ్యాంకులో జాయింట్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహించి, జూన్ 2024లో పదవీ విరమణ పొందారు. అనంతరం మిల్టన్‌కు అందాల్సిన ప్రయోజనాలు అందలేదని, మనస్తాపానికి గురై ఉరేసుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News April 11, 2025
గంజాయి నివారణకు రైల్వే పోలీసులతో విశాఖ సీపీ సమీక్ష

విశాఖ రైల్వే స్టేషన్ గుండా గంజాయి, మాదక ద్రవ్యాల రవాణా పూర్తిగా నిర్వీర్యం చేయడంపై రైల్వే పోలీసులతో విశాఖ సీపీ శంఖబ్రతా బాగ్చి శుక్రవారం సీపీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. రైళ్ల ద్వారా జరుగుతున్న గంజాయి అక్రమ రవాణా నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రైల్వే ఆస్తుల వద్ద భద్రతా, స్టేషన్ వద్ద స్కానింగ్ మిషన్ల ఏర్పాటు, స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పొదలు తొలగింపు, లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
News April 11, 2025
విశాఖ: దారి దోపిడీ చేసిన మైనర్‌ను పట్టుకున్న పోలీసులు

విశాఖలో దారి దోపిడీ చేసిన 17 ఏళ్ల మైనర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు క్రైమ్ డీసీపీ లతా మాధురి శుక్రవారం తెలిపారు. ఈనెల 10న స్టీల్‌ప్లాంట్ పరిధిలో ఓ మైనర్ ర్యాపిడో రైడ్ బుక్ చేశాడు. తుమ్మగంటి కిషోర్ ఆ రైడ్ పిక్ చేసుకొని మైనర్‌ను తీసుకెళ్తుండగా నిర్మానుష ప్రదేశంలో వాహనం ఆపి డ్రైవర్‌ను కొట్టి రూ.48,100 లాక్కున్నాడు. కిషోర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా సీపీ ఆదేశాల మేరకు ఆ మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
News April 11, 2025
విశాఖ: సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో రెండో శనివారం సెలవు రద్దు

విశాఖలో రెండో శనివారం ఎటువంటి సెలవు ఉండదని జిల్లా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ కార్యాలయం శుక్రవారం తెలిపింది. విశాఖలోని అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు యథావిధిగా జరుగుతాయని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. ప్రతి నెలలో రెండో శనివారం సెలవు కాగా ఈ వారం మాత్రం ప్రతి సబ్ రిజిస్టర్ కార్యాలయలు పనిచేస్తాయని తెలిపారు.