News May 27, 2024
విశాఖ: ఉష్ణోగ్రత పెరిగే అవకాశం

సముద్ర తీరానికి సమీపంలో ఉన్నా జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పద్మనాభం ప్రాంతంలో 45 డిగ్రీలు దాటుతున్నాయి. మంగళవారం నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశముందని వాతావరణ కేంద్రం పేర్కొంది. సోమవారం అనకాపల్లి జిల్లాలో 14, అల్లూరిలోని 10 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముంది. మంగళవారం ఉమ్మడి జిల్లాలో 42 మండలాల్లో వడగాలులు వీయొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Similar News
News November 16, 2025
కంచరపాలెంలో చెట్టుకు వేలాడుతున్న మృతదేహం

కంచరపాలెంలోని ఓ చెట్టుకు వేలాడుతున్న వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు శనివారం గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో కంచరపాలెం సీఐ రవికుమార్ సంఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. పదిరోజుల క్రితమే ఈ ఘటన జరిగి ఉండవచ్చని, మృతుని వయస్సు సుమారు 35-40 ఏళ్లు ఉంటుందని సీఐ తెలిపారు. మృతుని వివరాలు తెలియరాలేదని, దీనిని అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ చెప్పారు
News November 16, 2025
జగదాంబ జంక్షన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

జగదాంబ జంక్షన్లోని బస్స్టాప్ వద్ద ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న మహారాణిపేట సీఐ దివాకర్ యాదవ్ సంఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుని వివరాలపై ఆరా తీశారు. మృతుని ఒంటిపై గాయాలు లేవని.. అయితే అనారోగ్యం కారణంగా చనిపోయాడా? ఇంకా ఏమైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతదేహాన్ని KGH మార్చురీకి తరలించామని అతని వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని సీఐ కోరారు.
News November 16, 2025
విశాఖలో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి: మంత్రి

జీవీఎంసీ, VMRDA సంయుక్తంగా చేపడుతున్న పనులు వెంటనే పూర్తి చేయాలని మంత్రి నారాయణ సూచించారు. VMRDA కార్యాలయంలో అర్ధరాత్రి వరకు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, VMRDA కమిషనర్ తేజ్ భరత్, అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు. లేఔట్లో మౌలిక వసతులు ఉండేలా చూడాలన్నారు.


