News July 11, 2024
విశాఖ: ఎంతైనా టీచరమ్మే కదా..!

గతంలో ఉపాధ్యాయురాలిగా పనిచేసిన రాష్ట్ర హోం మంత్రి విద్యార్థులతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం నిత్యం చేస్తున్నారు. ఏ కార్యక్రమంలో ఉన్నా, ఎక్కడికి వెళ్లినా పాఠశాల చిన్నారులు కనిపిస్తే చాలు కొద్దిసేపు వారితో గడుపుతున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను ఒక వైపు పర్యవేక్షిస్తూనే మరోవైపు దార్లపూడిలో ప్రభుత్వ పాఠశాల చిన్నారులను ఆప్యాయంగా పలకరించి వారితో కొద్దిసేపు ముచ్చటించారు.
Similar News
News November 15, 2025
CII సమ్మిట్.. శ్రీసిటీలో మరో 5 ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన

CII సమ్మిట్‌లో మరో 5 ప్రాజెక్ట్‌లను CM చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. తిరుపతి (D) శ్రీసిటీలో ఈ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నట్లు CM చెప్పారు. పార్క్‌లో ఇప్పటికే 240 యూనిట్లు ఉండగా.. వెర్మీరియన్ ఇండియా రెహబ్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్మ్‌వెస్ట్ మిరాయ్‌టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, థింక్ గ్యాస్, ఆన్‌లోడ్‌గేర్స్ ఎక్స్‌పోర్ట్స్, యూకేబీ ఎలక్ట్రానిక్స్ ఈ లిస్ట్‌లో చేరనున్నాయి.
News November 15, 2025
విశాఖ పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి లోకేశ్

విశాఖ టీడీపీ కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్ శనివారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. వ్యవసాయ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని విజయనగరానికి చెందిన బంగారి శ్రీనివాసరావు మంత్రి లోకేశ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెకు వైద్యసాయం అందించి ఆదుకోవాలని నెల్లూరుకు చెందిన కొప్పాల సుధాకర్ విజ్ఞప్తి చేశారు.
News November 15, 2025
విశాఖ-హైదరాబాద్ రూ.18వేలు

విశాఖలో జరుగుతున్న CII సమ్మిట్‌కు పారిశ్రామికవేత్తలు, డెలిగేట్స్ భారీగా తరలివచ్చారు. శుక్రవారం సదస్సు ప్రారంభం కాగా.. ముందురోజే నగరానికి చేరుకున్నారు. దీంతో గురువారం నుంచి రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనంగా మరికొన్ని విమానాలను నడిపినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. నేటితో సమ్మిట్ ముగియనుండడంతో హైదరాబాద్ నుంచి విశాఖకు టికెట్ రూ.4,000 – 5,000 వరకు ఉండగా.. విశాఖ-హైదరాబాద్ రూ.18వేల వరకు ఉంది.


