News August 16, 2024

విశాఖ: ఎంత కష్టమో..!

image

ఏజెన్సీ ప్రజలకు చనిపోయిన తర్వాతా డోలీ మోతలు తప్పడం లేదు. పెదబయటు మండలం బొంగరం పంచాయతీ కుంబుర్లకు చెందిన వంతల గంగమ్మ  వైజాగ్ KGHలో అనారోగ్యంతో 14వ తేదీ చనిపోయింది. మృతదేహాన్ని 15వ తేదీ ఉదయం అంబులెన్సులో తీసుకెళ్లారు. ఊరికి 4 కిలోమీటర్లు దూరంలోనే డెడ్ బాడీని దింపేసి అంబులెన్సు వెళ్లిపోయింది. అక్కడి నుంచి గ్రామస్థులు డోలీలో స్వగ్రామానికి తీసుకెళ్లారు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

Similar News

News October 8, 2024

విశాఖ: స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర మంత్రితో సీఎం చర్చ

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసే అంశంపై కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో సీఎం చంద్రబాబు కీలక చర్చలు జరిపారు. ఢిల్లీలో సీఎం అధికార నివాసంలో మంగళవారం కేంద్రమంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మతో చంద్రబాబు భేటీ అయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సమావేశంలో విశాఖ ఎంపీ శ్రీభరత్ పాల్గొన్నారు.

News October 8, 2024

విశాఖ‌ జిల్లాలో “ప‌ల్లె పండ‌గ” వారోత్సవాల‌కు ప్ర‌ణాళిక సిద్ధం

image

విశాఖ‌ జిల్లాలో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వ‌ర‌కు “ప‌ల్లె పండ‌గ” వారోత్స‌వాల‌ను ప్ర‌ణాళికాయుతంగా నిర్వ‌హించేందుకు ప‌టిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. మంగళవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన సమీక్ష కలెక్టర్ మాట్లాడారు. రూ.29 కోట్ల అంచ‌నా వ్య‌యంతో గ్రామీణ ప‌రిధిలో 322 ప‌నుల‌కు ప్ర‌తిపాద‌న‌లు రూపొందించామన్నారు.

News October 8, 2024

విశాఖ: టెట్ పరీక్షకు 4165 మంది అభ్యర్థుల హాజరు

image

జిల్లాలో ప్రశాంతంగా టెట్ పరీక్షలు జరుగుతున్నట్లు డీఈఓ చంద్రకళ తెలిపారు. మంగళవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. మంగళవారం టెట్ పరీక్షకు 4614 మంది పరీక్షలు రాయాల్సి ఉందన్నారు. అయితే 4165 మంది పరీక్ష రాశారని ఆమె పేర్కొన్నారు. ఉదయం 5 కేంద్రాల్లో మధ్యాహ్నం 5 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. కాగా తాను రెండు కేంద్రాలను తనిఖీ చేయగా ఫ్లయింగ్ స్క్వేర్ మూడు కేంద్రాల్లో తనిఖీలు చేపట్టిందన్నారు.