News April 2, 2024

విశాఖ ఎంపీగా ఇదే అత్యధిక మెజారిటీ

image

విశాఖ లోక్‌సభ స్థానం 1952లో ఏర్పడింది. ఉప ఎన్నికలతో కలిపి మొత్తం 18 సార్లు ఎన్నికలు జరిగాయి. 1952 ఎన్నికల్లో ద్విసభ విధానంతో ఇద్దరు ఇండిపెండెంట్‌లు గెలుపోందారు. 1984 ఎన్నికల్లో TDP నుంచి భాట్టం శ్రీరామమూర్తి అత్యధిక మెజారిటీ 1,40,431 నమోదుకాగా, 2019లో YCP నుంచి MVV సత్యనారాయణ అత్యల్ప మెజారిటీ 4,414 నమోదయ్యింది. మరి ఈసారి ఎన్నికల్లో ఎవరు ఎంత మెజారిటీతో గెలుస్తారని భావిస్తున్నారో కామెంట్ చేయండి.

Similar News

News November 19, 2025

విశాఖ కమీషనరేట్‌లో వెయిటింగ్ హాల్ ప్రారంభం

image

విశాఖ నగర పోలీసు కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి కమీషనరేట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన సందర్శకుల వెయిటింగ్ హాల్‌ను ప్రారంభించారు. కమిషనర్ కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు హాల్ సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు తదితర అధికారులు పాల్గొన్నారు.

News November 18, 2025

మహిళలు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు సాధించాలి: రాయపాటి

image

మహిళలు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలపై పురోగతి సాధించాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్శన్ డా.రాయపాటి శైలజ అన్నారు. మంగళవారం ఏయూ సెమినార్ హాల్‌లో దుర్గాబాయి దేశ్ ముఖ్ విమెన్ సెంటర్ ఫర్ స్టడీస్ ఆధ్వర్యంలో మహిళల భద్రతను నిలబెట్టడం, విజయానికి బెంచ్‌ మార్కింగ్ భవిష్యత్తును నిర్ధారించే అంశాలపై సెమినార్ నిర్వహించారు. విశాఖపట్నం జిల్లాకు ‘సేఫెస్ట్ సిటీ’ అని ర్యాంకింగ్ రావడం సంతోషంగా ఉందన్నారు.

News November 18, 2025

రేపే దీపోత్సవం.. ఏర్పాట్లు పూర్తి

image

పద్మనాభంలో వేంచేసి ఉన్న శ్రీఅనంతపద్మనాభ స్వామి దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు సాయంత్రం 5:30లకు జైగంట మోగగానే మెట్లకి ఇరువైపులా దీపాలు వెలిగించే కార్యక్రమం మొదలవుతుంది. ఆ సమయంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలి.