News April 28, 2024

విశాఖ: ఎన్నికల బరిలో నిలిచే వారెవరో.. తేలేది రేపు

image

సార్వత్రిక ఎన్నికల పోటీలో నిలిచే వారి సంఖ్య రేపు స్పష్టం కానుంది. శనివారం నాడు ఎవరూ నామినేషన్ ఉపసంహరించుకోలేదు. 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువుంది. ఈరోజు సెలవు కావడంతో సోమవారం పలువురు తమ నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. లోక్ సభకు 33 మంది, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు 119 మంది నామ పత్రాలు దాఖలు చేశారు. వీరిలో ఎంతమంది ఉంటారనేది సోమవారం తేలనుంది.

Similar News

News December 17, 2025

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో రికార్డు ఉత్పత్తి: పల్లా

image

విశాఖ స్టీల్ ప్లాంట్ ఒకే రోజు 21,012 మెట్రిక్ టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. డిసెంబర్‌లో ప్లాంట్ 92% సామర్థ్యంతో నడుస్తోందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రూ.14 వేల కోట్ల నిధులతో ప్లాంట్‌ను ఆదుకుంటోందని, ప్రైవేటీకరణ జరగదని స్పష్టం చేశారు. హాట్ మెటల్‌ను పారబోస్తున్నారన్న ప్రచారం అవాస్తవమని తెలిపారు.

News December 17, 2025

విశాఖ: హోంగార్డు టు సివిల్ పోలీస్‌

image

లక్ష్యాన్ని సాధించాలనే దృక్పథం ఉండాలే తప్ప ఏదైనా సాధించవచ్చు అని విశాఖకి చెందిన హోంగార్డు నిరూపించాడు. బాలాజీ 40 ఏళ్ల వయసులో హోంగార్డుగా ఐటీ కోర్‌లో పని చేస్తూ రాత్రింబవళ్ళు కష్టపడి సిటీ సివిల్ పోలీస్‌గా ఎంపికయ్యాడు. యువతతో అన్ని విభాగాల్లోనూ పోటీపడుతూ ఉత్తమప్రతిభ చూపిస్తూ 6 నిమిషాల్లో 1,600 మీటర్లు పరిగెత్తి శభాష్ అనిపించుకున్నాడు. మంగళగిరిలో నిన్న నియామక పత్రం అందుకున్నాడు.

News December 17, 2025

విశాఖలో పెరుగుతున్న విమాన ప్రయాణికుల రద్దీ

image

విశాఖ నుంచి విమానయాన ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఇక్కడి నుంచి రోజుకు 28 దేశీయ విమాన సర్వీసులు.. వారానికి 2 అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతిరోజూ సగటున 8,500-9,000 మంది ప్రయాణికులు విశాఖ విమానాశ్రయం ద్వారా ప్రయాణిస్తున్నట్లు గణాంకాలు కలవు. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖ నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఎయిర్‌ కనెక్టిటివీ అవసరం ఎంతైనా ఉంది.