News March 22, 2024
విశాఖ: ‘ఎన్నికల విధుల నుంచి ఎవరికీ మినహాయింపు లేదు’
ఎన్నికల విధుల నుంచి ఎవరికీ మినహాయింపు లేదని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున స్పష్టం చేశారు. గురువారం పోల్ మేనేజ్మెంట్, సిబ్బంది కేటాయింపు ఇతర అంశాలపై చర్చించే నిమిత్తం జిల్లాలోని అన్ని శాఖల అధిపతులతో కలెక్టరేట్ వీసీ హాలులో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని శాఖల పరిధిలో పని చేసే ఉద్యోగులు, సిబ్బంది వివరాలను అత్యంత ఖచ్చితంగా జిల్లా యంత్రాంగానికి నివేదించాలన్నారు.
Similar News
News September 19, 2024
విశాఖ: 4,972 మంది లైసెన్సులు తాత్కాలికంగా రద్దు
బైకర్‌లు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రాజారత్నం సూచించారు. గోపాలపట్నంలో ఆయన మాట్లాడుతూ.. హెల్మెట్లు ధరించకుండా ప్రయాణిస్తున్న 4,972 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను మూడు నెలలపాటు తాత్కాలికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 2 నుంచి 11వ తేదీ వరకు జరిగిన స్పెషల్ డ్రైవ్‌లో 5,543 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
News September 19, 2024
రుషికొండలో ప్రతిరోజూ శ్రీవారి లడ్డూ విక్రయాలు
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. రుషికొండలో గల శ్రీ మహాలక్ష్మీ గోదాదేవి సహిత శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఎంతో ప్రీతికరమైన తిరుమల లడ్డూ ఇక నుంచి ప్రతి రోజూ విక్రయించనున్నట్లు ఆలయ ఏఈఓ జగన్మోహనాచార్యులు తెలిపారు. ఇప్పటి వరకు వారంలో మూడు రోజులు మాత్రమే విక్రయించే వారమని, భక్తుల కోరిక మేరకు ఇక నుంచి ప్రతి రోజూ విక్రయిస్తామని ఆయన వెల్లడించారు.
News September 18, 2024
భీమిలి: స్కూల్ బస్సు కింద పడి విద్యార్థి మృతి
భీమిలి మండలం నారాయణరాజుపేట గ్రామంలో విషాదం నెలకొంది. రౌడి గ్రామంలోని నర్సరీ చదువుతున్న బి.వేణు తేజ(5) బస్సు దిగి వెనుక వైపు నిల్చున్నాడు. గమనించని డ్రైవర్ రివర్స్ చేయగా.. ఆ బాలుడు బస్సు వెనుక చక్రాల కింద పడి చనిపోయాడు. బస్సు ఆ చిన్నారి తలపై నుంచి వెళ్లిపోయింది. బస్సుకు క్లీనర్ లేకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.