News February 20, 2025

విశాఖ: ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణపై కలెక్టర్ సమీక్షా

image

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణ, ఇతర ఏర్పాట్లపై విశాఖ కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సమీక్షా నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ, పోలింగ్ ఏజెంట్‌లు, ఎన్నికల విధులు సన్నద్ధతపై ఉత్తరాంధ్ర జిల్లాల ఏఆర్వోలకు సూచనలు చేశారు. ఎన్నిక‌లకు సంబంధించిన‌ విధుల‌ నిర్వహ‌ణ‌లో అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలని ఆదేశించారు.

Similar News

News March 24, 2025

శారదాపీఠంలోని ప్రభుత్వ భూముల గుర్తింపు నోటీసులు జారీ

image

శారదా పీఠంలోని ప్రభుత్వ భూములను గుర్తించి నోటీసులు జారీ చేశారు. చిన్నముషివాడ శారదా పీఠంలో సర్వే నెంబర్ 90లో 22 సెంట్లు రాస్తా ఆక్రమించారని, ఏడు నిర్మాణాలు తొలగించి ఖాళీ చేసి వెళ్లిపోవాలని పెందుర్తి తహశీల్దార్ శారద పీఠం మేనేజర్‌కు నోటీసులు అందించారు. ఇప్పటికే పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దర్యాప్తు చేపట్టారు.

News March 24, 2025

సింహాచలం అప్పన్న పెండ్లిరాట ఎప్పుడంటే?

image

సింహాచలం అప్పన్న స్వామివారి వార్షిక కళ్యాణం చైత్ర శుద్ధ ఏకాదశి అనగా వచ్చేనెల 8వ తేదీన నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన పెండ్లిరాట మహోత్సవాన్ని ఉగాది పర్వదినాన జనపనున్నారు. ఈనెల 30వ తేదీన సాయంత్రం సుముహూర్త సమయంలో పెండ్లిరాటను వేస్తారు. మండపంలో మధ్యాహ్నం నూతన పంచాంగ శ్రవణం అయిన తర్వాత ఈ పెండ్లిరాట మహోత్సవాన్ని నిర్వహిస్తారు.

News March 24, 2025

విశాఖ కలెక్టరేట్లో ఫిర్యాదుదారులకు స్నాక్స్

image

విశాఖ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతలు అందించేందుకు సోమవారం జనం భారీగా తరలివచ్చారు. దీంతో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ప్రత్యేక చొరవ తీసుకొని ఫిర్యాదుదారులకు మజ్జిగ, వాటర్ బాటిల్స్, బిస్కెట్లు అందిస్తున్నారు. వృద్ధులకు సైతం ఇబ్బందులు లేకుండా వీల్ ఛైర్లు ఏర్పాటు చేశారు. 

error: Content is protected !!