News February 7, 2025
విశాఖ: ఎమ్మెల్సీ స్థానానికి మరో మూడు నామినేషన్లు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి శుక్రవారం మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయి. ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్కు సంబంధిత పత్రాలు అందజేసి నామినేషన్ దాఖలు చేశారు. వారిలో నూకల సూర్యప్రకాష్, రాయల సత్యనారాయణ, గాదె శ్రీనివాసులు నాయుడు ఉన్నారు. ఈ క్రమంలో కలెక్టర్ వారి చేత ప్రమాణం చేయించారు. ఇప్పటి వరకు మొత్తం ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి.
Similar News
News October 21, 2025
VZM: రేపటి నుంచి కార్తీకం.. శైవక్షేత్రాలు సిద్ధం

రేపటి నుంచి కార్తీకమాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలు ప్రత్యేక పూజలకు సిద్ధమయ్యాయి.
➤ పుణ్యగిరి ఉమాకోటి లింగేశ్వరస్వామి ఆలయం
➤ సారిపల్లి శ్రీదిబ్బేశ్వరస్వామి ఆలయం
➤ రామతీర్థం ఉమా సదాశివాలయం
➤ కుమిలి శ్రీగణపతి ద్వాదశ దేవాలయం
➤ బొబ్బిలి సోమేశ్వరస్వామి ఆలయం
➤ చీపురుపల్లి భీమేశ్వరస్వామి ఆలయం
ఇవి కాకుండా మీకు తెలిసిన శైవక్షేత్రాలను కామెంట్ చెయ్యండి.
News October 21, 2025
నిలవాలంటే గెలవాల్సిందే..

WWCలో భారత్ సెమీస్ ఆశలు సంక్లిష్టమయ్యాయి. తర్వాతి 2 మ్యాచుల్లో(న్యూజిలాండ్, బంగ్లాదేశ్)పై గెలిస్తే నేరుగా సెమీస్ వెళ్తుంది. అలా కాకుండా NZపై ఓడిపోతే BANపై తప్పకుండా గెలవాలి. అదే సమయంలో NZ తన తర్వాతి మ్యాచులో ENG చేతిలో ఓడాలి. అప్పుడే భారత్ SF చేరుతుంది. లేదంటే ఇంటిదారి పడుతుంది. ప్రస్తుతం IND, NZ చెరో 4 పాయింట్లతో సెమీస్ చివరి బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. AUS, SA, ENG ఇప్పటికే సెమీస్ చేరాయి.
News October 21, 2025
శ్రీగిరిపై రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు

ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రంలో రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నవంబర్ 21వ తేదీ వరకు నిర్వహించే ఈ మాసోత్సవాలకు అన్ని ఏర్పాట్లను దేవస్థానం సిద్ధం చేస్తోంది. భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేయడంలో భాగంగా పాతాళగంగ వద్ద పుణ్య స్నానాలకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. భక్తులు కార్తీక దీపాలను వెలిగించేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నారు.