News February 7, 2025
విశాఖ: ఎమ్మెల్సీ స్థానానికి మరో మూడు నామినేషన్లు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి శుక్రవారం మూడు నామినేషన్‌లు దాఖలు అయ్యాయి. ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌కు సంబంధిత పత్రాలు అందజేసి నామినేషన్ దాఖలు చేశారు. వారిలో నూకల సూర్యప్రకాష్, రాయల సత్యనారాయణ, గాదె శ్రీనివాసులు నాయుడు ఉన్నారు. ఈ క్రమంలో కలెక్టర్ వారి చేత ప్రమాణం చేయించారు. ఇప్పటి వరకు మొత్తం ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి.
Similar News
News March 23, 2025
కొత్త డీజీపీ ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

AP: కొత్త DGP ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు IPS అధికారుల పేర్లను కేంద్రానికి పంపింది. ఈ లిస్టులో రాజేంద్రనాథ్ రెడ్డి, మాదిరెడ్డి ప్రతాప్, హారీశ్ కుమార్ గుప్తా, కుమార్ విశ్వజిత్, సుబ్రహ్మణ్యం పేర్లు ఉన్నాయి. ఇందులో ముగ్గురి పేర్లను కేంద్రం తిరిగి రాష్ట్రానికి పంపనుంది. ప్రస్తుతం ఇన్‌ఛార్జ్ DGPగా ఉన్న హరీశ్ కుమార్‌నే మరో రెండేళ్లు DGPగా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
News March 23, 2025
కడ్తాల్: అందాల పోటీలకు పైసలు ఎక్కడివి: సర్పంచుల సంఘం

గ్రామ పంచాయతీల్లో సర్పంచులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులకు డబ్బులు లేవంటున్న ప్రభుత్వం అందాల పోటీలకు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలని మాజీ సర్పంచ్, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనరసింహారెడ్డి ప్రశ్నించారు. శనివారం కడ్తాల్‌లో మాట్లాడుతూ.. సొంత నిధులు వెచ్చించి గ్రామాల అభివృద్ధి చేసిన సర్పంచులకు బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం వేధిస్తుందని ఆరోపించారు. మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు.
News March 23, 2025
నేడు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సన్నాహక సమావేశం

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సన్నాహాక సమావేశం ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరంగర్‌లో ఉంటుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ అన్నారు. ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్ఛార్జి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు హాజరవుతున్నారని చెప్పారు. కావున జిల్లా ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ ఛైర్మన్లు, కాంగ్రెస్ అన్ని విభాగాల ప్రతినిధులు హాజరుకావాలని కోరారు.