News February 20, 2025

విశాఖ: ఎర్నాకుళం రైలుకు అదనపు భోగీ ఏర్పాటు

image

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు విశాఖ మీదుగా ప్రయాణించే హటియా-ఎర్నాకుళం(22837) రైలుకు అదనపు భోగి యాడ్ చేస్తామని వాల్తేరు డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. ఈ రైలుకు ఫిబ్రవరి 24న థర్డ్ ఏసీ ఎకానమీ క్లాస్ భోగి అదనంగా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

Similar News

News March 25, 2025

విశాఖలో 50% వడ్డీ పై రాయితీ: కలెక్టర్

image

జీవీఎంసీ పరిధిలో గృహ యజమానులు, ఆస్తిపన్ను చెల్లింపుదారులు మార్చి 31లోపు ఆస్తి పన్ను చెల్లిస్తే 50శాతం వడ్డీ పై రాయితీ మినహాయింపును పొందవచ్చని కలెక్టర్, జీవీఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్ ఎంఎన్ హరింధిర ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నగర ప్రజలు సౌకర్యార్థం, ప్రతీ వార్డు సచివాలయంలో ఆస్తిపన్ను బకాయిలను చెల్లించవచ్చు అన్నారు. మార్చి 30 ఆదివారం కూడా జోనల్ కార్యాలయాల్లో కేంద్రాలు పనిచేస్తాయన్నారు.

News March 25, 2025

డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లకు దరఖాస్తుల ఆహ్వానం

image

విశాఖ జిల్లాలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ & రీసెర్చ్ సెంటర్లు, రీజినల్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లకు దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు ఉప రవాణా కమీషనర్ శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రవాణా శాఖ మార్గదర్శకాల ప్రకారం అర్హతగల సంస్థలు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలు మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ www.morth.nic.in లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.

News March 25, 2025

విశాఖ : ఈ స్థానాలలో రిపోర్టర్లు కావలెను..!

image

విశాఖ నగరం కార్ షెడ్ , కొమ్మాది, రుషికొండ, సింహాచలం, దువ్వాడ, కూర్మన్నపాలెం, పాత గాజువాక, షీలానగర్, మర్రిపాలెం, ద్వారకానగర్ స్థానాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ <>https://forms.gle/LKQkvvd4Ak5ztdrT6<<>> లింకుపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయండి.

error: Content is protected !!