News July 11, 2024
విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితులకు అదనపు సాయం

విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ బాధితులతో పాటు ప్రభావిత గ్రామాలకు అదనంగా రూ.120కోట్ల సహాయం చేసేందుకు దాని మాతృ సంస్థ ఎల్జీ కెమ్ ముందుకు వచ్చింది. నిరంతరం వైద్య పరీక్షలకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ఐదువేల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు సీఎం చంద్రబాబుతో సంస్థ ప్రతినిధులు చర్చించారు.
Similar News
News April 19, 2026
ఆర్కేబీచ్ రోడ్డులో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

ఆర్కేబీచ్ రోడ్డులో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఫిషింగ్ హార్బర్ వైపు వెళ్తున్న బైకర్ డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 19, 2026
విశాఖ – భవానీపట్న రైలు రీషెడ్యూల్

ఇన్‌కమింగ్ రేక్ ఆలస్యం కావడంతో విశాఖ – భవానీపట్న ప్యాసింజర్ (58504) రైలు సమయాన్ని మార్చినట్లు సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు రాత్రి 7 గంటలకు విశాఖ నుంచి బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని రైల్వే అధికారులు కోరారు.
News April 19, 2026
విశాఖ: చందనోత్సవం వేళ.. 185 వాటర్ స్టాల్స్

సింహాచలంలో స్వామివారికి జరుగబోయే చందనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో GVMC చేపడుతున్న ఏర్పాట్లను కమిషనర్ కేతన్ గార్గ్ వెల్లడించారు. భక్తుల కోసం 185 వాటర్ స్టాల్స్, 6000 బబుల్ వాటర్ క్యాన్లు, 40,000 వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేశామన్నారు. 1,860 శానిటరీ సిబ్బంది, 600 డస్ట్ బిన్లు, 20 వాటర్ ట్యాంకర్లతో పాటు 372 మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.


