News May 26, 2024

విశాఖ: ఏయూ డిగ్రీ ఫలితాలు విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలలకు చెందిన ఆరో సెమిస్టర్ ఫలితాలు వెలువడ్డాయి. 27,603 మంది విద్యార్థులు ఆరో సెమిస్టర్‌కు హాజరు కాగా 27,483 మంది ఉత్తీర్ణులైనట్లు ఏయూ డిగ్రీ కళాశాల ఎగ్జామినేషన్ డీన్ ఆచార్య డీవీఆర్ మూర్తి తెలిపారు. 99.57 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏయూ వెబ్ సైట్‌లో ఉన్నాయని వెల్లడించారు.

Similar News

News October 25, 2025

నగరంలో క్రైమ్ రేట్ తగ్గించాలి: సీపీ శంఖబ్రత బాగ్చి

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఈనెల రివ్యూ మీటింగ్‌లో పోలీసు అధికారుల పనితీరుపై సమీక్షించారు. నగరంలో గంజాయి రవాణాను పూర్తిగా నిరోధించాలని, రౌడీ షీటర్లపై నిఘా పెంచాలని ఆయన ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, క్రైమ్ రేటు తగ్గించేలా రాత్రి నిఘా పటిష్ఠం చేయాలని సూచించారు. మహిళా భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, విధుల్లో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News October 25, 2025

విశాఖ: డెలివరీ బ్యాగ్‌లో గంజాయి రవాణా.. ఇద్దరి అరెస్ట్

image

డెలివరీ బ్యాగులను అడ్డుగా పెట్టుకుని గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని పీఎంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. కోమ్మాది ప్రాంతంలో నిర్వహించిన దాడిలో నల్లబిల్లి గణేశ్ (32), సంజయ్‌కుమార్ (29)ని పట్టుకున్నారు. ​వారి నుంచి 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అక్రమ రవాణాపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణ ప్రజలను కోరారు.

News October 25, 2025

విశాఖ: నాగుల చవితి సందర్భంగా ‘జూ’కు పోటెత్తిన సందర్శకులు

image

విశాఖ జూలో నాగుల చవితి సంబరాలు అంబరాన్నంటాయి. సందర్శకులు కుటుంబ సమేతంగా జూపార్క్‌కు తరలివచ్చి పుట్టలలో పాలు పోసి నాగదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. చవితి సందర్భంగా 9,664 మంది ‘జూ’ను సందర్శించగా సుమారు రూ.7.60 లక్షల ఆదాయం సమకూరినట్లు జూ క్యురేటర్ మంగమ్మ ప్రకటించారు. జూ పార్క్‌లో టపాసులు కాల్చవద్దని నిబంధన ఉండడంతో ప్రవేశ ద్వారం వద్ద క్షుణ్ణంగా పరీక్షించి సందర్శకులను పంపించినట్లు తెలిపారు.