News May 4, 2024
విశాఖ: ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 6న అనకాపల్లికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ తెలిపారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కశింకోట మండలం తాళ్ళపాలెంలో ఆ రోజు సాయంత్రం 4 గంటలకు సభ ఉంటుందని వెల్లడించారు. సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని తెలిపారు.
Similar News
News October 20, 2025
విశాఖలో జరిగే సీఐఐ సదస్సులో పాల్గొనండి: నారా లోకేష్

ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్(AIBC) ప్రతినిధులతో న్యూసౌత్ వేల్స్ పార్లమెంట్ ఆవరణలో సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల సాధించిన పెట్టుబడులను వివరించారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఐఐ సమ్మిట్లో పాల్గొనవలసిందిగా కోరారు.
News October 20, 2025
విశాఖలో అద్దె బస్సు డ్రైవర్ల సమ్మె

వాల్తేరు డిపోలో అద్దె బస్సు డ్రైవర్ల సమ్మె ఆదివారం కూడా కొనసాగింది. ఈ మేరకు డిపోకు చెందిన 29 బస్సులు నిలిచిపోయాయి. కార్యదర్శి బి.జంపన్న మాట్లాడుతూ.. రూ.26,000కి జీతం పెంచాలని, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలన్నారు. నైట్ హాల్ట్ అలవెన్సులు, దసరా బోనస్, రెండు జతల బట్టలు ఇవ్వాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న రూ.18వేల జీతంతో జీవనం కష్టంగా ఉందని వాపోయారు. జీతాలు పెంచే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు.
News October 19, 2025
విశాఖ: రేపు కలెక్టరేట్లో PGRS రద్దు

దీపావళి సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో సోమవారం విశాఖ కలెక్టరేట్లో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ఆదివారం తెలిపారు. అధికారులు ఎవరూ అందుబాటులో ఉండరని, కావున ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు. వచ్చేవారం యథావిధిగా వినతుల స్వీకరణ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.