News March 1, 2025
విశాఖ : ఒక్క నిమిషం .. వారి కోసం..!

విశాఖ జిల్లా వ్యాప్తంగా 87 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులను ఉదయం 8.30 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికార యంత్రాంగం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు పరీక్షా కేంద్రాలకు వెళ్లేటప్పుడు ట్రాఫిక్ జామ్ లేదా ప్రయాణానికి సౌకర్యం లేని వారికి కాస్త మనవంతు సాయం చేద్దాం.
Similar News
News March 26, 2025
ముఖ్యమంత్రి చేపట్టిన సదస్సులో పాల్గొన్న విశాఖ కలెక్టర్

రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మూడో విడత కలెక్టర్ల సదస్సు జరుగుతుంది. ఇందులో భాగంగా బుధవారం జరుగుతున్న సదస్సులో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పీ -4 సర్వే, పలు విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో అనకాపల్లి కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఉన్నారు.
News March 26, 2025
గాజువాకలో యువకుడి సూసైడ్

గాజువాక మండలం B.C రోడ్డులోని వాంబేకాలనీలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న పవన్(21) ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఆర్థిక పరిస్థితులే కారణంగా చనిపోతున్నట్లు మృతుడు సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 26, 2025
మేయర్ పీఠం.. విశాఖ అభివృద్ధికి శాపం కానుందా?

విశాఖ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు GVMC బడ్జెట్‌పై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2025-26కి సంబంధించి బడ్జెట్ సమావేశాన్ని ఈనెల 29న నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అయితే అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో YCP కార్పొరేటర్లను బెంగుళూరు తరలించారు. మేయర్, ఇద్దరు డిప్యూటీ మేయర్లూ YCPకి చెందిన వారే కావడంతో వారి హాజరుపై అనుమానం నెలకొంది. దీంతో సమావేశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.