News May 19, 2024
విశాఖ: ఒక్క నెలలో రూ.76 లక్షల ఆదాయం..!

రావికమతం మండలం కళ్యాణపులోవలో 4 గ్రామాలకు చెందిన ఆదివాసీలు ప్రభుత్వంపై ఆధారపడకుండా సేంద్రీయ పద్ధతిలో సాగు చేసి లక్షల రూపాయలు సంపాదించారు. 94 కుటుంబీకులు 110 ఎకరాల్లో జీడిమామిడి పంట ద్వారా ఈ ఏడాది ఒక్క నెలలోనే రూ.76,46,960లు సంపాదించుకున్నారు. ఆదివాసీల నాయకులు వీరిని చైతన్యవంతుల్ని చేసి వారి స్వశక్తి పైనే వ్యవసాయం చేసుకునేలా సహాయపడ్డారు.
Similar News
News December 4, 2025
విశాఖ: రక్షణలేని ఉక్కు నిర్వాసితుల స్థలాలు

ఉక్కు పరిశ్రమ నిర్వాసితుల కోసం కేటాయించిన స్థలాల్లో కబ్జాదారులు చొరబడుతున్నారు. ఇటీవల గాజువాకలోని వికాస్ నగర్ ITI రోడ్డు వద్ద సర్వే నంబర్ 153 భూమిలో రాత్రికి రాత్రే 18 షెడ్లు నిర్మించేందుకు ప్రయత్నించగా.. అధికారులు అడ్డుకున్నారు. బీసీ రోడ్డు శివాలయం దగ్గర ఆరేళ్లుగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. చివరకు అధికారులు నిర్మాణాలను తొలగించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.
News December 4, 2025
GVMC స్థాయి సంఘంలో ఇష్టారాజ్యంగా ప్రతిపాదనలు..

GVMC స్థాయి సంఘం సమావేశం శనివారం జరగనుంది. మొత్తం 257 అంశాలతో అజెండా కాపీలను సిద్ధం చేసి సభ్యులకు అందజేశారు. ఇన్ని అంశాలను ఒకే సారి పెట్టడం ద్వారా ఎలాంటి చర్చ లేకుండా అమోదించే అవకాశం ఉంది. దీంతో ఆయా అంశాలను స్థాయి సంఘం సభ్యులు పూర్తిగా చదివే అవకాశం కూడా లేకుండా పోతుంది. ప్రజాధనాన్ని అవసరం ఉన్నా.. లేకపోయినా ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
News December 4, 2025
విశాఖలో నేవీ అమరవీరులకు నివాళి

విశాఖ బీచ్ రోడ్డులోని ‘విక్టరీ ఎట్ సీ’ వద్ద తూర్పునౌకదళ అధికారులు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అమరులైన నావిక దళ వీరులకు నివాళులర్పించారు. రక్షణ వ్యవస్థలో తూర్పునౌకదళం కీలకంగా పనిచేస్తుందని వారు కొనియాడారు. నేవీ డే సందర్భంగా గురువారం ఉదయం ఈ కార్యక్రమం నిర్వహించారు. కాగా ఈ ఏడాది విశాఖలో నేవీ డే విన్యాసాలను నిర్వహించకపోవడంతో నగరవాసులు నిరుత్సాహానికి గురయ్యారు.


