News March 24, 2024
విశాఖ: ‘ఒక రివాల్వర్, పిస్టల్ స్వాధీనం’
విశాఖ నగరం రామ టాకీస్ సమీపంలో ట్రావెల్ కార్యాలయంలో ఒక పిస్టల్, ఒక రివాల్వర్, రెండు బుల్లెట్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఫకీరప్ప తెలిపారు. ముందుగా అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి వీటిని స్వాధీనం చేసుకున్నామన్నారు. శివాజీపాలెంకు చెందిన వి.శివనాగరాజు వీటిని దాచి ఉంచడంతో అతనిని అరెస్టు చేశామన్నారు. వీటిని వదిలి పారిపోయిన వ్యక్తి కోసం గాలిస్తున్నామన్నారు.
Similar News
News September 20, 2024
వరద బాధితులకు నెల జీతం విరాళంగా ఇచ్చిన స్పీకర్
రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు విజయవాడ వరద బాధితులకు ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురువారం చెక్కును సీఎం నారా చంద్రబాబు నాయుడుకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ సామర్థ్యానికి తగ్గట్టు సీఎం రిలీఫ్ ఫండ్‌కు సహాయం అందించాలని కోరారు. వరద ప్రాంత బాధితులకు ఆ నిధులు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
News September 19, 2024
సింహాచలం ఈవోగా వి.త్రినాథరావు
సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానమునకు కార్యనిర్వహణ అధికారిగా వి.త్రినాథరావును నియమిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ ఉత్వర్వుల జారీ చేశారు. ప్రస్తుతం ఆయన ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈవోగా పని చేస్తున్నారు. ఇక్కడ పనిచేసిన ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి తన మాతృ సంస్థ రెవెన్యూ శాఖకు తిరిగి వెళ్లిపోవడంతో ఆయన స్థానంలో త్రినాథరావు వచ్చారు.
News September 19, 2024
స్వర్ణాంధ్ర-2047పై సమీక్ష నిర్వహించిన విశాఖ కలెక్టర్
స్వర్ణాంధ్ర-2047పై అందరికీ అవగాహన ఉండాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సూచించారు. కలెక్టరేట్లో గురువారం స్వర్ణాంధ్ర-2047పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఐదేళ్లలో సాధించబోయే ప్రగతిపై ప్రణాళికలతో కూడిన నివేదికలను రూపొందించాలన్నారు. ప్రతి ఏటా 15% ఆర్థిక పురోగతి కనిపించాలన్నారు.