News May 11, 2024
విశాఖ: ఓటుకు రూ.1000 నుంచి 1500..?

మరో 48 గంటల్లో ఈవీఎంలపై బటన్ నొక్కేందుకు ఓటరు సిద్ధమవుతుండగా..వారిని ఆకర్షించేందుకు అభ్యర్థులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే బూత్ల వారీగా ఓటర్ల జాబితాను సేకరించి రూ.1000 నుంచి 1500 ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర ప్రాంతాల వారికి ఆన్లైన్ పేమెంట్ చెయ్యగా.. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఇస్తున్నారు. పట్టణాల్లో టోకెన్ సిస్టం పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తుండంతో అధికారులు నిఘా పెంచారు.
Similar News
News December 9, 2025
విశాఖలో ఆయిల్ పామ్ సాగుకు 100% రాయితీ

విశాఖ జిల్లాలో 100 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉద్యాన అధికారిణి శ్యామల తెలిపారు. రైతులకు 100% రాయితీపై మొక్కలు, అంతర పంటల నిర్వహణకు రూ.21,000 సాయం, డ్రిప్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇది 30 ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయం ఇస్తుందని, భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల రైతులు ఆర్బీకేల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News December 8, 2025
జీవీఎంసీలో అడ్డగోలు ప్రతిపాదనలు వెనక్కి..!

జీవీఎంసీలో అభివృద్ధి పనులపై 287 అంశాలకు గాను 34 అంశాలను స్థాయి సంఘం ఆమోదం తెలపకూండా శనివారం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనలకు ఆమోదం విషయంలో కాంట్రాక్టర్లతో కుమ్మక్కు అయ్యారంటూ స్థాయి సంఘం సభ్యులపై వార్తలు రావడంతోనే వీటిని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. చర్చ సమయంలో కొందరు అధికారుల తప్పిదాలకు తాము విమర్శలు ఎదుర్కోవల్సి వస్తుందని స్థాయి సంఘం చైర్మన్ పీలా శ్రీనివాసు సైతం వ్యాఖ్యానించారు.
News December 8, 2025
విశాఖ: డిసెంబర్ 21న పల్స్ పోలియో

ఈ నెల 21న జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో 5 సంవత్సరాలలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో పల్స్ పోలియో పై అధికారులకు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ 100 శాతం పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లాలో 2,09,652 మంది ఐదు సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలు ఉన్నారని 1062 పల్స్ పోలియో బూత్లను ఏర్పాటు చేశామన్నారు.


