News September 30, 2024
విశాఖ: ‘ఓటుహక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి’
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు అర్హులైన ఉపాధ్యాయులందరూ ఓటు హక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. సోమవారం నోటిఫికేషన్ వెలువడిందన్నారు. ఓటు నమోదు ప్రక్రియ కూడా ప్రారంభమైందని నవంబర్ 6 వరకు కొనసాగుతుందన్నారు. నవంబర్ 23న డ్రాఫ్ట్ పబ్లిష్ అవుతుందన్నారు. 23 నుంచి డిసెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ, 30న తుది జాబితా ప్రకటిస్తామన్నారు. >Share it
Similar News
News October 7, 2024
విశాఖ: డిప్యూటీ సీఎంతో ముగిసిన భేటీ
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో విశాఖ ఉక్కు పోరాట కమిటీ నాయకుల భేటీ ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిగాయి. ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయమని కార్మికులు డిమాండ్ చేశారు. ఉక్కు కర్మాగారంలో జరుగుతున్న పరిణామాలను డ్రాఫ్ట్ రూపంలో కార్మిక సంఘాల నాయకుల పవన్ కళ్యాణ్‌కు అందజేశారు.
News October 6, 2024
విశాఖ: Pic oF The Day
విశాఖ కుర్రోడు నితీశ్ కుమార్ రెడ్డి ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. ఐపీఎల్‌లో అదరగొట్టిన నితీశ్ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ-20 సీరిస్‌కు ఎంపికయ్యారు. ఆదివారం జరుగుతున్న తొలి మ్యాచ్‌తో అరంగేట్రం చేశారు. టీం సభ్యుల మధ్య టీం ఇండియా క్యాప్ అందుకున్నారు. అతనితో పాటు మయాంక్ యాదవ్‌కు కూడా ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడంతో వీరిద్దరూ టీం ఇండియా క్యాప్‌లతో ఫొటోలు తీసుకున్నారు.
News October 6, 2024
ఇబ్బంది కలగకుండా ఇసుక బుకింగ్ విధానం: కలెక్టర్
ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇసుక బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చినట్లు విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. వార్డు గ్రామ సచివాలయం ద్వారా ఇసుక బుకింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించామన్నారు. గత నెల 29 నుంచి ఇప్పటివరకు 442 మంది ఇసుక బుకింగ్ చేసుకోగా 357మందికి ఏడు వేల మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేశామన్నారు. ప్రజలే ఇసుకను రవాణా చేసుకునే విధంగా కూడా అవకాశం కల్పించామన్నారు.