News May 23, 2024

విశాఖ: ఓట్ల లెక్కింపు వేళ ప్రత్యేకంగా మీడియా సెంటర్ ఏర్పాటు

image

ఓట్ల లెక్కింపు జరిగే సమయంలో మీడియాకు ఎప్పటికప్పుడు సమాచారం అందించటానికి ప్రత్యేకంగా మీడియా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం కలెక్టర్ ఈ సెంటర్ ఏర్పాటు చేసే భవనాన్ని పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, సంబంధిత ఏర్పాటు చేయాలని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారికి సూచించారు. కలెక్టర్ వెంట జేసీ మయూర్ అశోక్, తదితరులు ఉన్నారు.

Similar News

News December 9, 2025

విశాఖలో కాగ్నిజెంట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న CM

image

CM చంద్రబాబు ఈనెల 12న‌ విశాఖలో ప‌ర్య‌టించ‌నున్నారు. ముందుగా మధురవాడ ఐటీ సెజ్ హిల్-2లో ప్రముఖ IT కంపెనీ కాగ్నిజెంట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అదేవిధంగా కాపులుప్పాడలో ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో శాశ్వత భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం వీఈఆర్ సమావేశానికి హాజరై, వివిధ అభివృద్ధి అంశాలపై సమీక్ష చేస్తారు. పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

News December 9, 2025

విశాఖలో టెట్ పరీక్షలు.. అభ్యర్థులకు డీఈవో కీలక సూచనలు

image

విశాఖ జిల్లాలో AP TET-2025 పరీక్షలు డిసెంబర్ 10 నుంచి 21 వరకు 12 కేంద్రాల్లో ఆన్‌లైన్ (CBT) విధానంలో జరగనున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్, ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తప్పక తీసుకురావాలని, పరీక్ష సమయానికి 30 నిమిషాల ముందే సెంటర్‌కు చేరుకోవాలని ఆయన సూచించారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధమని స్పష్టం చేశారు.

News December 9, 2025

విశాఖ: పలు రైళ్లు రద్దు.. మరికొన్ని కుదింపు

image

భద్రతా పనుల కారణంగా కేకే లైన్‌లో పలు రైళ్లను నియంత్రిస్తున్నట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం పవన్ కుమార్ తెలిపారు. డిసెంబర్ 9, 10వ తేదీల్లో విశాఖ-కిరండూల్, హీరాఖండ్, రూర్కెలా ఎక్స్‌ప్రెస్‌ కోరాపుట్ లేదా దంతెవాడ వరకే నడుస్తాయి. అదేవిధంగా డిసెంబర్ 13, 15వ తేదీల్లో విశాఖ-కిరండూల్ పాసింజర్ రైలు విశాఖపట్నం-కోరాపుట్ మధ్య రద్దు చేయబడింది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలి.