News December 25, 2024
విశాఖ: కనకమహాలక్ష్మికి మార్గశిర పూజలు
విశాఖ నగరం బురుజుపేటలో వేంచేసియున్న కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో లక్ష్మీ హోమాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో జరిపించారు. భక్తులు పలువురు అమ్మవారిని దర్శించుకున్నారు. 2,500 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ ఈవో శోభారాణి పాల్గొన్నారు.
Similar News
News January 13, 2025
నర్నీపట్నం: కస్తూరిబా గాంధీ పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్
నర్సీపట్నం వేములపూడి కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల ప్రిన్సిపల్ శాంతిని సస్పెండ్ చేస్తున్నట్లు సర్వ శిక్షా అభియాన్ ఏపీడి జయప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. గురుకుల పాఠశాలలో బాలికలు అస్వస్థతకు గురైన సమయంలో సమాచారాన్ని ఒక రోజు ఆలస్యంగా అధికారులకు చెప్పడాన్ని తప్పుపడుతూ సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ అంశంలో మరో ఇద్దరు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
News January 13, 2025
అనకాపల్లి: బాలిక పై అత్యాచారం
అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలంలో ఐదేళ్ల బాలిక పై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన శనివారం జరగగా బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని ఆదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులకు ఫిర్యాదు మేరకు యలమంచిలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ సత్యనారాయణ దర్యాప్తు చేపట్టారు. బాలికను కేజీహెచ్‌కు తరలించారు.
News January 13, 2025
విశాఖ: 400 ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపిన ఆర్టీసీ
విశాఖ ద్వారక బస్సు స్టేషన్ నుంచి సంక్రాంతి సందర్భాన్ని పరిష్కరించుకుని 400 ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపినట్లు రీజినల్ మేనేజర్ బి.అప్పలనాయుడు తెలిపారు. నాలుగు రోజుల నుంచి హైదరాబాద్‌కు 25, విజయవాడకు 40 బస్సులు నడపగా, ఆదివారం శ్రీకాకుళం 100, రాజమండ్రికి 20, కాకినాడకు 20, పార్వతీపురానికి 40, సాలూరుకు 30 బస్సులతో పాటు రద్దీగా ఉన్న ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపామన్నారు.