News January 31, 2025
విశాఖ: కన్న కొడుకే హత్య చేశాడు

విశాఖలో శుక్రవారం తెల్లవారుజామున రక్తపు మడుగులో పడి ఉన్న మహిళ మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. <<15316841>>ఆల్కాసింగ్<<>> భర్త బదిలీ కావడంతో ఇటీవలే ముంబై నుంచి విశాఖ వచ్చారు. పెద్ద కొడుకు ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటు పడి చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడని మందలించింది. దీంతో తల్లిని తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మల్కాపురం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News October 17, 2025
తిన్న వెంటనే నడుస్తున్నారా?

భోజనం చేశాక నడిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే తిన్న వెంటనే కాకుండా 10-15 నిమిషాల తర్వాత వాకింగ్ చేస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. తిన్న వెంటనే నడిస్తే కడుపు ఉబ్బరంగా అనిపించవచ్చని చెబుతున్నారు. భోజనం చేశాక 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే త్వరగా జీర్ణం అవుతుందని, బరువు తగ్గుతారని సూచిస్తున్నారు.
Share it
News October 17, 2025
మంత్రి లోకేశ్‌పై వైసీపీ సెటైరికల్ పోస్ట్

ఏపీలో పరిశ్రమల ఏర్పాటుపై Xలో TDP, YCP సెటైరికల్ పోస్టులు పెడుతున్నాయి. ‘గూగుల్‌ను సమర్థించలేక, ఎలా విమర్శించాలో అర్థంకాక YCP గుడ్డు బ్యాచ్ గుడ్డు మీద ఈకలు పీకుతోంది’ అంటూ TDP అమర్నాథ్ ఫొటోను క్రియేట్ చేసి పోస్ట్ చేసింది. దీనిపై YCP స్పందిస్తూ ‘పరిశ్రమల ఏర్పాటుపై అమర్నాథ్ గుక్కతిప్పుకోకుండా అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక పప్పు గుత్తి తిప్పుకుంటున్న నిక్కర్ మంత్రి లోకేశ్’ అని పేర్కొంది.
News October 17, 2025
రసమయి బాలకిషన్‌పై చర్యలు తీసుకోవాలి: కాంగ్రెస్ ఫిర్యాదు

మానకొండూరు MLA కవ్వంపల్లి సత్యనారాయణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ MLA రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు CP గౌష్ ఆలంకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకులు అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. గోసి గొంగడి నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన రసమయి బాలకిషన్ ఈరోజు వందల కోట్ల ఆస్తులు, ఫామ్ హౌస్‌లు ఎలా సంపాదించారో బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు.