News May 10, 2024

విశాఖ: కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి

image

అచ్యుతాపురం మండలం పూడిమడకలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎజ్జల సోమునాయుడు, మైలిపల్లి రాజు చేపల చెరువు వద్ద ప్రమాదవశాస్తు కరెంట్ షాక్‌తో చనిపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. సోమునాయుడు అవివాహితుడు కాగా.. రాజుకు పెళ్లై ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు.  

Similar News

News February 18, 2025

విశాఖ: రెండు రైళ్లు రద్దు

image

కార్యాచరణ పరిమితుల కారణంగా కొన్ని రైళ్లు రద్దు చేయనున్నట్లు రైల్వే శాఖ సోమవారం రాత్రి ప్రకటించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి, ప్రత్యామ్నాయ ప్రణాళికలు చేసుకోవాలని సూచించింది. రానుపోను రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.  ✔ ఫిబ్రవరి 21న సంత్రాగచ్చి-ఎంజీఆర్ చెన్నై ఎక్స్‌ప్రెస్ (22807)✔ ఫిబ్రవరి 18న షాలిమర్-విశాఖ ఎక్స్ ప్రెస్(22853) రద్దు చేశారు.

News February 18, 2025

విశాఖకు చేరుకున్న ఎమ్మెల్సీ బ్యాలెట్ ప‌త్రాలు

image

ఉత్త‌రాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27వ తేదీన జ‌ర‌గ‌నుంది. ఈ నేపథ్యంలో ఎన్నిక‌ల‌ బ్యాలెట్ ప‌త్రాలు విశాఖ జిల్లాకు సోమవారం చేరుకున్నాయి. ఓట‌ర్లు, పోలింగ్ కేంద్రాలు, పోటీ చేసే అభ్య‌ర్థుల ఫోటోలు, ఇత‌ర‌ వివ‌రాల‌తో కూడిన నివేదిక‌ల‌ను స్థానిక‌ అధికారులు ఇప్ప‌టికే పంపించారు. సంబంధిత బ్యాలెట్ ప‌త్రాల‌ను క‌ర్నూలులో ప్రింటింగ్ చేశారు. ఈ పత్రాలు విశాఖకు సోమవారం చేరుకున్నాయి.

News February 18, 2025

కావ్యరచనకు ఆధ్యుడు వాల్మీకి మహర్షి: చాగంటి

image

వాల్మీకి మహర్షి కావ్యరచనకు ఆధ్యుడని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. విశాఖ మధురవాడ గాయత్రీ కళాశాల వేదికగా నిర్వహిస్తున్న శ్రీమద్రామాయణం ఉపన్యాసాన్ని ఆయన సోమవారం కొనసాగించారు. ఈ సందర్భంగా కావ్యాన్ని అత్యంత సుందరంగా అభివృద్ధి చేయడం వాల్మీకి మహర్షికే సాధ్యమన్నారు. ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడే చేయాలని రామాయణంలో స్వామి హనుమ వివరించి తెలిపారని పేర్కొన్నారు. తర్వాత చేస్తే ప్రయోజనం శూన్యమన్నారు.

error: Content is protected !!