News June 18, 2024

విశాఖ: కరెంట్ షాక్‌తో నేపాల్ విద్యార్థి మృతి

image

కె.కోటపాడు మండలం బొట్టవానిపాలెం గ్రామ సమీపంలో ఓ కళాశాలలో చదువుతున్న నేపాల్‌కు చెందిన విద్యార్థి జీవన్ మగర్(23) విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. సోమవారం విద్యుత్ మోటారు ఆన్ చేయడానికి వెళ్లి విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కళాశాల యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కె.కోటపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News January 16, 2025

గాజువాకలో దారుణం.. చిన్నారి మృతి

image

గాజువాకలోని పండగ వేళ ఓఅపార్ట్మెంట్ వద్ద సెల్లార్‌లో ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని కారు ఢీకొంది. తీవ్రగాయాలతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. సుజాతనగర్ ప్రాంతానికి చెందిన భోగిర్ల లారీణి తన తల్లిదండ్రులతో సెల్స్ట్ అపార్ట్మెంట్‌లోని బంధువుల ఇంటికి వచ్చారు. చిన్నారి ఆడుకుంటుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. గాజువాక పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పండగ వేళ ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

News January 15, 2025

గాజువాకలో దారుణం.. చిన్నారి మృతి

image

గాజువాకలోని పండగ వేల ఒక అపార్ట్మెంట్ వద్ద సెల్లార్‌లో ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని కారు ఢీకొంది. తీవ్రగాయాలతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. సుజాతనగర్ ప్రాంతానికి చెందిన భోగిర్ల లారీణి తన తల్లిదండ్రులతో సెల్స్ట్ అపార్ట్మెంట్‌లోని బంధువుల ఇంటికి వచ్చారు. చిన్నారి ఆడుకుంటుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. గాజువాక పోలీసులు కారు డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారు. పండగ వేళ ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

News January 14, 2025

మధురవాడ: రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

image

మధురవాడ జాతీయ రహదారిపై ఆనందపురం వెళుతున్న ఓ బైక్‌పై లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో కారు ఢీకొనడంతో వెనుక కూర్చున్న మహిళ కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పీఎం పాలెం ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కార్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పీఎం పాలెం ట్రాఫిక్ సీఐ సునీల్ దర్యాప్తు చేపట్టారు.