News March 23, 2024

విశాఖ: కరెంట్ షాక్‌తో యువకుడి మృతి

image

విశాఖ జీవీఎంసీ 6వ వార్డ్ పీఎం పాలెం గాయత్రి నగర్‌లో చిల్ల సంతోష్ (27) అనే వ్యక్తి శుక్రవారం కరెంట్ షాక్‌కి గురై మృతి చెందాడు. గాయత్రి నగర్‌లోని ఓ భవనంలో ప్లంబింగ్ పని చేస్తూ ఉండగా ఈ ఘటన జరిగిందని, స్థానికుల సమాచారం ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుని స్వస్థలం విజయనగరం జిల్లా జామి మండలం చిల్లపాలెంగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News January 10, 2025

‘గేమ్ ఛేంజర్’లో విశాఖ కలెక్టర్‌గా రామ్ చరణ్..!

image

రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ వైజాగ్ ప్రేక్షకులకు స్పెషల్ అనుభూతిని పంచింది. రామ్ చరణ్ విశాఖ కలెక్టర్‌గా.. బ్రహ్మానందం విజయనగరం కలెక్టర్‌గా పనిచేశారు. విశాఖ యూనివర్సిటీ పేరుతో ఉన్న భవనంలో పలు ఫైట్ సీన్లు ఉన్నాయి. షూటింగ్ టైంలో పబ్లిక్ మీటింగ్ కోసం R.K బీచ్‌లో పెద్ద సెట్ వేశారు. బీచ్ రోడ్డు NTR బొమ్మ దగ్గర సాంగ్ షూట్ చేశారు. కొన్ని క్యారెక్టర్ల పేర్లు కూడా మన ఉత్తరాంధ్ర యాసలోనే ఉన్నాయి.

News January 10, 2025

విశాఖ నుంచి పలు ప్రాంతాలకు స్పెషల్ బస్సులు 

image

సంక్రాంతి దృష్ట్యా విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ఈ నెల 13 వరకు రెగ్యులర్ బస్సులతో పాటు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు విశాఖ జిల్లా ప్రజా రవాణాధికారి తెలిపారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు 20, రాజమండ్రి, విజయవాడకు 40, కాకినాడకు 20, విజయనగరం, పాలకొండ, పార్వతీపురం, శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాలకు 830 బస్సులు నడవనున్నాయన్నారు.

News January 10, 2025

విశాఖ: ఈనెల 18న జడ్పీ స్థాయి సంఘం సమావేశాలు

image

విశాఖ జిల్లా పరిషత్ స్థాయి సంఘం సమావేశాలు ఈనెల 18వ తేదీన నిర్వహించనున్నట్లు సీఈఓ పి.నారాయణమూర్తి తెలిపారు. జడ్పీ చైర్ పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన ఈ సమావేశాలు జరుగుతాయన్నారు. ఈ మేరకు జడ్పిటిసి సభ్యులు ఎంపీపీలకు ఆహ్వానాలు పంపించడం జరిగిందన్నారు. అధికారులు తప్పనిసరిగా సమావేశాలకు హాజరుకావాలని సూచించారు.